ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:53 AM

మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, సీఎంకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల పోటాపోటీ నినాదాలు

  • మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో పరిస్థితి ఉద్రిక్తం

వెల్దుర్తి, అక్టోబరు 11: మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, సీఎంకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైందని, మహాలక్ష్మి పథకంలో భాగంగా పురుషుల పేరిట ఉన్న గ్యాస్‌ కనెక్షన్‌కూ సబ్సిడీ ఇవ్వాలని, సబ్సిడీ కొందరికే వర్తిస్తోందని, కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు వెంటనే తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


దీంతో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం డౌన్‌డౌన్‌ అంటూ పోటాపోటీగా నినాదాలు చేయడం మొదలెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. రసాభాస మధ్య ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వివాదం అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. తానేం మాట్లాడాలో కూడా కాంగ్రెస్‌ వారే చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కొందరు గుండాల్లా వ్యవహరిస్తూ నినాదాలు చేశారని ఆరోపించారు.

Updated Date - Oct 12 , 2024 | 03:53 AM