Kodanda Reddy: రైతుల ఖాతాల్లో 25 వేల కోట్లు జమ
ABN, Publish Date - Oct 10 , 2024 | 04:30 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే రైతుల ఖాతాల్లో రూ. 25 వేల కోట్లు జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం. కోదండరెడ్డి తెలిపారు.
గత పదేళ్ల కష్టాల నుంచి విముక్తి: కోదండరెడ్డి
వ్యవసాయ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే రైతుల ఖాతాల్లో రూ. 25 వేల కోట్లు జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం. కోదండరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం బీఆర్‌కే భవన్‌లో వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వే్‌షరెడ్డి, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, రైతుసంఘం నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఒక పంటకు పెట్టుబడి సాయం అందించడంతోపాటు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని అన్నారు. రైతులను రుణ విముక్తులను చేయడంతోపాటు వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి తోడునీడగా ఉంటామని కోదండరెడ్డి చెప్పారు.
Updated Date - Oct 10 , 2024 | 04:30 AM