ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputations: పంచాయతీరాజ్‌ శాఖలో డిప్యుటేషన్లు రద్దు

ABN, Publish Date - Dec 16 , 2024 | 03:45 AM

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఉద్యోగులు, అధికారులకు డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఆదివారం మెమో జారీచేశారు.

  • వీటి కారణంగా ఉద్యోగుల్లో పెరుగుతున్న పనిభారం

  • క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించి ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఉద్యోగులు, అధికారులకు డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఆదివారం మెమో జారీచేశారు. శాఖాపరంగా సిబ్బంది కొరత, ఉన్న ఉద్యోగులు పలువురు డిప్యుటేషన్ల పేరిట ఇతరశాఖలు, విభాగాల్లో చేరడంతో పనిభారం పెరిగి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖలోని ఉద్యోగులు, వివిధస్థాయిల అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ఆ శాఖలో అసలు డిప్యుటేషన్లను అనుమతించకూడదని నిర్ణయించింది.


అంతే కాకుండా డిప్యుటేషన్‌పై ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారికి మూడేళ్ల సర్వీసు పూర్తయితే కొనసాగించకూడదని నిశ్చయించింది. ప్రధానంగా పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని ఉద్యోగులు, ఇతర విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో వివిధ పనుల పర్యవేక్షణకు ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో డిప్యుటేషన్లను ప్రోత్సహించవద్దని, ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారికి మూడేళ్ల గడువు పూర్తయితే వారిని కొనసాగించవద్దని ఉన్నతస్థాయి అధికారులు, అన్ని జిల్లాల విభాగాలను ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఆదేశించారు.

Updated Date - Dec 16 , 2024 | 03:45 AM