ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌కు 3 నమూనాలు!

ABN, Publish Date - Aug 31 , 2024 | 04:38 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారి అలైన్‌మెంట్‌ కోసం ఏకంగా మూడు నమూనాలు సిద్ధం చేస్తోంది.

  • అలైన్‌మెంట్‌ ఖరారు కోసం రూపల్పన

  • రైతుల సాగు భూముల్లేని మార్గంపై యోచన

  • ఫోర్త్‌ సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు

  • ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు

  • 189.2 కిలోమీటర్లకు 2 వేల హెక్టార్ల భూమి

  • భూ పరిహారానికి రూ.7 వేల కోట్లు

  • మొత్తం రూ.16 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారి అలైన్‌మెంట్‌ కోసం ఏకంగా మూడు నమూనాలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బెంగళూరు హైవే.. అన్నీ అధిక భాగం దక్షిణ భాగం మార్గంలోనే ఉండడంతో అలైన్‌మెంట్‌ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇప్పటికే ఉత్తరభాగం మార్గం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుండగా, త్వరలో టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు.


ఈ నేపథ్యంలోనే ఉత్తరభాగం పనులతో సమాంతరంగా దక్షిణ భాగానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే దక్షిణభాగంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు లేకుండా.. సాగేతర, అటవీయేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు.


ఇందులో భాగంగానే ఇప్పుడు దక్షిణ రింగ్‌ అలైన్‌మెంట్‌ను మూడు నమూనాల్లో సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మూడు నమూనాల్లో ప్రాంతాలు మారనుండడంతోపాటు, ఆ మార్గంలో సాగు, సాగేతర, అటవీ, అటవీయేతర భూములు ఎంతమేర ఉంటాయనే అన్ని వివరాలను పొందుపరచనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలవగా, త్వరలోనే మూడు నమూనాలు సీఎం వద్దకు చేరనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అన్ని అంశాలను పరిశీలించి.. ఈ మూడు నమూనాల్లో ఒక దానిని ఖరారు చేయనున్నారు.


  • గతంలోనే ప్రాథమిక మ్యాప్‌..

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం రోడ్డు నిర్మాణంలో కీలకమైన అలైన్‌మెంట్‌పై గతంలోనే ఒక మ్యాప్‌ను ప్రాథమికంగా సిద్ధం చేసినా.. అది ఖరారు కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రోడ్డు నిర్మాణం సహా పలు అంశాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఉన్న రూట్‌మ్యాప్‌ ప్రకారం ఈ రహదారి చౌటుప్పల్‌ వద్ద ప్రారంభమై.. ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానం కానుంది. ఇది మొత్తం 189.2 కిలోమీటర్ల పరిధిలో ఉండగా.. దీని నిర్మాణానికి దాదాపు 2వేల హెక్టార్ల భూమి అవసరమవుతుంది. భూ పరిహారం కింద రూ.7 వేల కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉండగా.. మొత్తం రోడ్డు నిర్మాణానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయని అధికారుల ప్రాథమిక అంచనాల్లో తేలినట్టు సమాచారం. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్‌ సహా వివిధ అంశాలను అద్యయనం చేసేందుకు ఢిల్లీకి చెందిన ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్‌ అండ్‌ టెక్నోకార్డ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.


ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో ప్రతి 1.5 కిలోమీటర్లు లేదా 2కిలోమీటర్లకు ఒక అండర్‌పాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు మొత్తం మార్గంలో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్వోబీ)-04, మేజర్‌ బ్రిడ్జిలు- 13, మైనర్‌ బ్రిడ్జిలు-79, బాక్స్‌ కల్వర్టులు-317, పైప్‌ కల్వర్టులు- 159, లైట్‌ వెహి కల్‌ అండర్‌పా్‌సలు-9, చిన్న వాహనాల అండర్‌పా్‌సలు- 91, పాదచారులు వెళ్లేందుకు వీలుగా (పీయూపీ) అండర్‌పా్‌సలు- 4, ఇంటర్‌సెక్షన్స్‌- 11, దాదాపు 10కిపైగా టోల్‌ప్లాజాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో తాజాగా పునఃపరిశీలన జరుపుతున్న దక్షిణభాగంలోనూ ఎక్కడెక్కడ అండర్‌పా్‌సలు, బ్రిడ్జిలు, ఇంటర్‌ఛేంజ్‌లతో సహా వంతెనలను నిర్మించాల్సి ఉంటుందనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధ ంగా ఈ రోడ్డు నిర్మాణం మధ్యలో ఉన్న విద్యుత్‌ లైన్లు సహా ఇతర యుటిలిటీ్‌సకు సంబంఽధించిన వివరాలనూ సేకరిస్తున్నారు.

Updated Date - Aug 31 , 2024 | 04:38 AM

Advertising
Advertising