ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Custom Milling: గ్యారంటీ కస్టమ్స్‌!

ABN, Publish Date - Oct 07 , 2024 | 04:03 AM

మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ధాన్యాన్ని అప్పగించాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ధాన్యం విలువలో 25 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని కూడా అధికారులు స్పష్టం చేశారు.

  • హామీ ఇస్తేనే కస్టమ్‌ మిల్లింగ్‌కు వడ్లు.. అప్పుడే మిల్లర్లను నియంత్రించవచ్చని భావన

  • ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో 100ు గ్యారెంటీ

  • దీన్నే అనుసరించాలని సర్కారు యోచన

  • సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల కసరత్తు

  • 25ు గ్యారెంటీకే అంగీకరించని మిల్లర్లు!

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ధాన్యాన్ని అప్పగించాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ధాన్యం విలువలో 25 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనిని మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. సీఎంఆర్‌ తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. కానీ, కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు అప్పనంగా ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇతర రాష్ట్రాల తరహాలో 100 శాతం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని సర్కారు తాజాగా నిర్ణయించింది.


ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా ప్రభుత్వాలు 100 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా 100 శాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పౌర సరఫరాల కార్పొరేషన్‌కు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై అధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే, 25 శాతం బ్యాంకు గ్యారెంటీకే అంగీకరించని మిల్లర్లు.. 100 శాతం బ్యాంకు గ్యారెంటీకి ఒప్పుకొంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంమీద ధాన్యానికి బ్యాంకు గ్యారెంటీపై ఉత్కంఠ నెలకొంది.


  • ఇతర రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లో బోనస్‌ సిస్టమ్‌ లేదు. అక్కడ కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటున్నారు. కానీ, మిల్లర్ల నుంచి వంద శాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటున్నారు. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలో కూడా 100 శాతం గ్యారెంటీ తీసుకొని మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తున్నారు. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాల్లో క్వింటాకు రూ.3,100 చొప్పున ధాన్యం సేకరిస్తున్నారు. దీంతో అక్కడ బ్యాంకు గ్యారెంటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నాలకు రూ.500 బోనస్‌ ప్రకటించింది. క్వింటా రూ.2,800 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీంతో ఇక్కడా 100 శాతం బ్యాంకు గ్యారెంటీ అమలు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకు గ్యారెంటీ లెటర్‌ తెస్తే.. మిల్లర్లకు బాధ్యత, భయం ఉంటాయని.. నిబంధనల మేరకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అందిస్తారనే ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో బ్యాంకు గ్యారెంటీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. అదే క్రమంలో బ్యాంకు గ్యారెంటీ ఇచ్చినప్పటికీ డిఫాల్టర్లకు ధాన్యం ఇవ్వకూడదనే అంశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.

  • మధ్యంతర గోదాములకు ధాన్యం!

మిల్లర్లు అడిగినా, అడగకపోయినా, సామర్థ్యం లేకపోయినా ధాన్యం దించేయకుండా మధ్యంతర (ఇంటర్మీడియట్‌) గోదాముల్లో ధాన్యం నిల్వ చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెంటర్లలో నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో గత్యంతరం లేక మిల్లుల్లో ధాన్యం దింపాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యంతర గోదాములు ఏర్పాటు చేసుకొని నిల్వ చేయడమే మేలనే ప్రతిపాదన వచ్చింది. అప్పుడు ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మిల్లింగ్‌ చేయించుకోవచ్చు. ఈ సీజన్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మధ్యంతర గోదాములకు తరలించాలనే అంశంపై చర్చ జరుగుతోంది.


రాష్ట్రంలో 1,287 గోడౌన్లు ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 65 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా.. ప్రస్తుతం 36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు, ఎరువుల నిల్వలు ఉన్నాయి. ఇంకా 26 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వలు పట్టే జాగా ఖాళీగా ఉంది. దీనికితోడుగా మరికొంత ప్రైవేటు స్థలం తీసుకొని మధ్యంతర గోదాముల్లో ధాన్యం నిల్వచేసే అంశంపై కసరత్తు జరుగుతోంది. అయితే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్‌ చేయించి, దొడ్డు ధాన్యాన్ని మాత్రం గోదాములకు తరలించే సూచనలు కనిపిస్తున్నాయి.


  • సన్నధాన్యం మిల్లింగ్‌పై మిల్లర్ల మడతపేచీ

సన్నధాన్యం మిల్లింగ్‌ చేస్తే వచ్చే బియ్యం పరిమాణంపై మిల్లర్లు పేచీ పెడుతున్నారు. దొడ్డు బియ్యం వచ్చినట్లుగా 67 శాతం సన్నబియ్యానికి రాదని, 58- 60 శాతం మేరకే వస్తుందని చెబుతున్నారు. సన్న ధాన్యం మిల్లింగ్‌ చేస్తే నష్టపోతామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. క్వింటా ధాన్యం తీసుకొని, 67 కిలోల బియ్యం ఇవ్వడం ద్వారా 7 కిలోలు నష్టపోతామని, దానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఎఫ్‌సీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే కస్టమ్‌ మిల్లింగ్‌ చేయాలని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన ఉండదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చౌహాన్‌ మిల్లర్లకు స్పష్టంచేశారు. నష్టపరిహారం ఇవ్వకుండా ధాన్యం ఇస్తే తీసుకునేది లేదని మిల్లర్లు ప్రభుత్వానికి సంకేతాలు పంపుతున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 04:03 AM