ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!

ABN, Publish Date - Dec 29 , 2024 | 04:49 AM

ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను ప్రభుత్వం సంక్రాంతిలోపే అందుబాటులోకి తేచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. భూభారతికి సంబంధించి సీసీఎల్‌ఏ మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించింది.

  • నిబంధనల రూపకల్పనలో సీసీఎల్‌ఏ

  • పోర్టల్‌ డ్యాష్‌బోర్డుకు మూడు రకాల ప్రతిపాదనలు

  • ధరణిలో 11 మాడ్యూల్స్‌.. భూభారతిలో ఆరే

  • 11 కాలమ్స్‌తో అందుబాటులోకి పహణీ సీఎం ఆమోదం, గవర్నర్‌ నోటిఫైతో వెంటనే అమల్లోకి

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను ప్రభుత్వం సంక్రాంతిలోపే అందుబాటులోకి తేచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. భూభారతికి సంబంధించి సీసీఎల్‌ఏ మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. ఒకటి.. భూభారతి ప్రధాన శీర్షికగా సీఎం చిత్రం, రాష్ట్ర ప్రభుత్వ లోగోతో కీలక అంశాలన్నీ కనిపించేలా చేయడం.. మరొకటి.. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించి కీలక అంశాలన్నీ తొలి పేజీలో కనిపించేలా చేయడం.. ఇంకొకటి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులువుగా తెలుసుకునేలా, ఎక్కువ మంది పరిశీలించే అంశాలన్నీ ఒకే చోట కనిపించేలా చేయడం! ఇలా మొత్తమ్మీద ప్రాథమికంగా మూడు రకాల ప్రతిపాదనలను రూపొందించారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్‌లో 33 మాడ్యుల్స్‌ ఉండగా భూభారతిలో వాటిని ఆరుకు కుదించారు. 11 కాలమ్స్‌తో కొత్తగా భూభారతిలో పహణీని పునరుద్ధిరించడంతో ఈ వివరాలు కూడా పోర్టల్‌ ద్వారా తెలుసుకునేలా డిజైన్‌ చేస్తున్నారు. తొలుత నమూనా అంశాలతో పోర్టల్‌ డిజైన్‌లు చేస్తున్నారు. ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ వచ్చాక పూర్తి స్థాయి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.


ఇందుకోసం రెవెన్యూ శాఖ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీఎల్‌ఏ, ఎన్‌ఐసీ నేతృత్వంలో అధికారులు ప్రతి అంశాన్ని రైతుల కోణంలో పరిశీలించి డిజిటల్‌ ప్లాట్‌ఫాం ఎలా ఉండాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. తొలి పేజీలో ఏయే అంశాలు కనిపించాలి? ప్రజలకు సులువుగా, యూజర్‌ఫ్రెండ్లీగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మూడు రకాల ప్రతిపాదనలు సీసీఎల్‌ఏ సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డికి పంపనుంది. సీఎం ఆమోదం పొందిన వెంటనే ఆచరణలోకి తీసుకురానున్నారు. గవర్నర్‌ నోటిఫై చేసిన వెంటనే భూభారతి-2024 అమల్లోకి రానుంది. ఈ ప్రక్రియ అంతా సంక్రాంతి లోపే ముగించేసి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూభారతి చట్టంపై ఇప్పటికే ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంపై సీఎం రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చట్టం అమల్లోనూ లోటుపాట్లు, విమర్శలకు తావులేకుండా ఉండేలా నిబంధనల రూపకల్పన చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీసీఎల్‌ఏ అధికారులు అంశాల వారీగా మార్గదర్శకాలపై దృష్టిసారించారు. గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది జాబ్‌చార్ట్‌తోపాటు, భూభారతి-2024 చట్టం అమలుకు సంబంధించి కీలక అంశాల విషయంలో నిబంధనల రూపకల్పనలో అధికారులు తలమునకలై ఉన్నారు.


జనవరి మొదటి వారంలోపు గవర్నర్‌ నోటిఫై చేసే అవకాశం ఉందని భావిస్తున్న సీసీఎల్‌ఏ అధికారులు.. ఈలోపు ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారసత్వ బదిలీ కాకుండా మిగిలిన భూలావాదేవీల విషయంలో, సాగులో ఉండి హక్కు పత్రాలు లేని సుమారు 10 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులకు హక్కు పత్రాలు ఎలా ఇవ్వాలి? 1971కి ముందు పాస్‌పుస్తకాలు ఉండి, 2020 ధరణిలో పాస్‌పుస్తకాలు రాని వారికి భూ భారతి చట్టంలో పాస్‌పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి సమస్యలపై న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. లావోని పట్టా, 38-ఈ సర్టిఫికెట్‌, 13-బి సర్టిఫికేట్‌, ఓఆర్‌సీ, సేల్‌ సర్టిఫికెట్‌ ద్వారా హక్కులు పొంది ఉన్న వారు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంటే హక్కుల రికార్డులో మార్పులు చేసి ఇలాంటి వారికి పాస్‌పుస్తకాలు ఇచ్చేలా భూభారతి చట్టంలో అవకాశం కల్పిస్తున్నందున మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి పాస్‌పుస్తకాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Dec 29 , 2024 | 04:49 AM