ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narsapur: ట్రిపుల్‌ ఆర్‌ నిర్వాసితులకు తీపి కబురు?

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:59 AM

ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగంలోని నర్సాపూర్‌ డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోనే తీపి కబురు అందనుంది.

  • నర్సాపూర్‌ డివిజన్‌లోని గ్రామాల్లో మార్కెట్‌ ధర ఇవ్వాలని సర్కారు యోచన

  • దానికి మూడు రెట్లు పరిహారం ఇచ్చే చాన్స్‌

  • దాంతో ఎకరాకు రూ.40 లక్షలు వచ్చే వీలు

  • ఒకటి రెండు రోజుల్లో ప్రకటన

నర్సాపూర్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగంలోని నర్సాపూర్‌ డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. వీరందరికీ ప్రస్తు తం బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. దీని పై ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెదక్‌ జిల్లాలో చేసిన సర్వే ప్రకా రం నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లోని 17 గ్రామాల్లో 752.48 ఎకరాల మేర భూములు కోల్పోయే రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్న రెడ్డిపల్లి, కొంతాన్‌పల్లి రైతుల నుంచి మంగళవారం అభిప్రాయాలను సేకరించారు. కాగా, ప్రస్తుతం నర్సాపూర్‌ నియోజకవర్గంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.50 లక్షలకు పైగా పలుకుతోంది. ప్రభుత్వ ధర మాత్రం రూ.4.50 లక్షలే ఉన్నది.


దీంతో ట్రిపుల్‌ ఆర్‌ కోసం భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.15 లక్షలకు మించి వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో విలువైన భూములు కోల్పోతున్న తమకు అన్యాయం చేయవద్దంటూ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడం, నిలదీయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై ఓ కమిటీని వేసి పరిహారం ఎంత పెంచాలనే విషయమై నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రూ.4.50 లక్షలను.. బహిరంగ మార్కెట్‌తో సమానంగా రూ.13 లక్షలకు పెంచాలని నివేదించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆ రూ.13 లక్షలకు మూడింతల పరిహారం ఇవ్వాలని సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులకు ఎకరాకు రూ.40 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.


  • పరిహారం పెరగడం పక్కా: ఆర్డీవో

ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కోల్పోయే రైతులకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరకు దగ్గరగా పరిహారం వచ్చేలా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది. పరిహారం విషయంలో రైతులు ఆందోళన చెందొద్దు.

Updated Date - Oct 16 , 2024 | 03:59 AM