ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌ సీఐడీ చేతికి..

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:18 AM

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎ్‌స) నుంచి నేర పరిశోధన విభాగం(సీఐడీ)కు బదలాయించింది.

  • సీసీఎస్‌ నుంచి బదలాయించిన ప్రభుత్వం

  • మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశం.. రూ.వేల కోట్లలో స్కామ్‌ జరిగిందని నిర్ధారణ

  • ఇప్పటికి తేలింది రూ.1,400 కోట్లు.. సోమేశ్‌కుమార్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎ్‌స) నుంచి నేర పరిశోధన విభాగం(సీఐడీ)కు బదలాయించింది. ఈ స్కామ్‌లో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సంస్థల భాగస్వామ్యం ఉండడం, ఏకంగా రూ.1400 కోట్ల కుంభకోణం కావడంతో.. సీఐడీకి అప్పగించింది. ప్రాథమిక విచారణ మేరకు ఈ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) పాత్ర ఉన్నట్లు తేలడంతో.. సీఐడీ దర్యాప్తు పూర్తయితే.. ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని తెలుస్తోంది. కుంభకోణం మొత్తం సోమేశ్‌కుమార్‌ కనుసన్నల్లోనే నడిచినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఆడిట్‌లోనే తేలిన స్కామ్‌ వస్తువులను భౌతికంగా సరఫరా చేయకపోయినా.. బోగస్‌ ఇన్వాయి్‌సలను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివర్లో నిర్వహించిన ఆడిట్‌లో గుర్తించింది.


ఆ తర్వాత అంతర్గత విచారణ జరిపి, స్కామ్‌ నిజమేనని నిర్ధారించుకున్నాక.. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సోమేశ్‌కుమార్‌తో సహా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్‌ శివరామ్‌ ప్రసాద్‌, ఐఐటీ-హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ(ఐజీఎస్టీ)కి సంబంధించి రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీసీఎస్‌ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్‌ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అందుకే సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించింది.


  • ఐఐటీ-హైదరాబాద్‌ పాత్ర ఏంటి?

జీఎస్టీలో అక్రమాలను గుర్తించడానికి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సాంకేతిక సహకారం కోసం ఐఐటీ-హైదరాబాద్‌ను సర్వీసు ప్రొవైడర్‌గా నియమించుకుంది. రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులను పరిశీలించడానికి ఈ సర్వీసు ప్రొవైడర్‌ ‘స్ర్కూటినీ మాడ్యూల్స్‌’ను అభివృద్ధి చేసింది. కానీ.. ఇక్కడి డీలర్లు ‘జీఎస్టీఆర్‌-3బి’ రిటర్నులను దాఖలు చేయకపోయినా.. ఈ స్ర్కూటినీ మాడ్యూల్‌ గుర్తించలేకపోయింది. వాణిజ్య పన్నుల శాఖ 2023 డిసెంబరు 26న ఐఐటీ-హైదరాబాద్‌ ప్రాంగణంలో నిర్వహించిన దర్యాప్తులో ఇది నిజమని తేలింది. ఐజీఎస్టీ రిటర్నుల ఫైలింగ్‌ను గుర్తించకుండా ఉండడానికి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు ఆ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాంతో పాటు ఐఐటీ-హైదరాబాద్‌లోని ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ వాణిజ్య పన్నుల శాఖ స్ర్కూటినీ వ్యవహారాలను చూస్తుందని వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగానే.. కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌, ప్లియాంటో సంస్థను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి వివరణ కోరారు.


సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడానికి సూచనలిచ్చామని కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ అంగీకరించినట్లు సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరు అధికారులతో పాటు సోమేశ్‌కుమార్‌ ‘స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌’ పేరిట ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని, తరచూ సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునేవారని గుర్తించింది. సోమేశ్‌ ఇచ్చే సమాచారంతోనే ఆ ఇద్దరు అధికారులు ఐఐటీ-హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబుతో మాట్లాడేవారని తేలింది. ఇలా వీరి సూచనల మేరకు 75 సంస్థలకు సంబంధించిన ఐటీ రిటర్నుల సమాచారం తెలియకుండా చేశారని గుర్తించింది. తద్వారా ఐటీసీ క్లెయిమ్‌లకు వీలు కల్పించారని, ఇందులో రూ.1400 కోట్ల వరకు ఐటీసీ సొమ్మును అడ్డదారుల్లో క్లెయిమ్‌ చేసుకున్నారని గుర్తించారు. ఒక్క తెలంగాణ బేవరెజెస్‌ కార్పొరేషన్‌కు సంబంధించినదే రూ.1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు గుర్తించారు. మరో 11 సంస్థలకు సంబంధించి రూ.400 కోట్ల ఐటీసీ సొమ్మును క్లెయిమ్‌ చేసినట్లు తేలింది. సీఐడీతో మరింత లోతుగా దర్యాప్తు చేయిస్తే.. ఈ కుంభకోణంలో మరిన్ని మోసాలు బయటపడతాయని ప్రభుత్వం నిర్ణయించి, ఆ మేరకు ఆదేశాలిచ్చింది.


1000 కోట్ల జీఎస్టీ నిందితుడు.. నోరు విప్పితే బూతులు

  • అదనపు కమిషనర్‌ విశ్వేశ్వరరావు తీరు

  • విచారణ బృందం నిర్ధారణ.. సీఎం వద్ద ఫైలు..త్వరలో చర్యలు!

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని మహిళా అధికారుల పట్ల ఆ శాఖ అదనపు కమిషనర్‌ కాశీ విశ్వేశ్వరరావు అసభ్య పదజాలంతో విరుచుకుపడడం వాస్తవమేనని ‘విచారణాధికారుల బృందం’ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సీఎం రేవంత్‌ వద్దకు చేరింది. సీఎం త్వరలోనే ఆ అధికారిపై తగిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలోని కింది స్థాయి మహిళా అధికారుల పట్ల కాశీవిశ్వేశ్వరరావు అసభ్య పదజాలాన్ని వాడారని, తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ బూతుల వ్యవహారం గత ఏడాది డిసెంబరు నెలలో ప్రకంపనలను సృష్టించింది. ఆయన ప్రవర్తనకు విసిగిపోయిన మహిళా అధికారులు వాణిజ్య పన్నుల కమిషనర్‌ టీకే శ్రీదేవికి ఫిర్యాదు చేశారు.


తెలంగాణ వాణిజ్య పన్నుల గెజిటెడ్‌ అధికారుల సంఘం కూడా 2023 డిసెంబరు 12న కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా కాశీవిశ్వేశ్వరరావుపై కమిషనర్‌ టీకే శ్రీదేవి అదనపు కమిషనర్లు జయకామేవ్వరి, సునీత, ఫణీంద్రరెడ్డితో విచారణ జరిపించారు. ఈ బృందం గత ఏడాది డిసెంబరు 29న బాధిత అధికారుల నుంచి వివరాలు, సాక్ష్యాలను సేకరించి.. ప్రాథమిక నివేదికను అందజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సమగ్ర నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదిక వాణిజ్య పన్నుల శాఖ నుంచి సచివాలయంలోని ముఖ్యమంత్రి పేషీకి వెళ్లింది. సీఎం దీనిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. కాశీవిశ్వేశ్వరరావు మహిళా అధికారుల పట్ల వాడిన అసభ్య పదజాలం వాస్తవమేనని విచారణ బృందం తన సమగ్ర నివేదికలో స్పష్టం చేసింది. మహిళా అధికారుల పట్ల ఆయన... ‘అది’, ‘ఇది’, ‘దీని సంగతి’ వంటి పదాలను వాడారని తేల్చింది.


మహిళా అధికారులు ఏదైనా అధికారిక లేఖ రాసినా, ఫోన్‌ మెసేజ్‌ పెట్టినా.. ‘లవ్‌ లెటర్‌’ రాశావేంటి అంటూ సంబోధించేవారని విచారణ బృందానికి బాధితులు వివరించినట్లు తెలిసింది. పనితనం బాగా లేదన్న కారణంతో మహిళా అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరించేవారని, మానసిక ఆందోళనకు గురి చేసేవారని ఆ నివేదిక తెలిపింది. కింది స్థాయి అధికారులను కులాల పేర్లతో.. ‘గొల్లది’, ‘రెడ్డిది’.. అంటూ సంబోధించేవారని పేర్కొంది. ఈ విషయమై శాఖలోని జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తెలంగాణ వాణిజ్య పన్నుల గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రతినిధులను విచారించామని, అవసరమైన సాక్ష్యాలను సేకరించామని, కాశీవిశ్వేశ్వరరావు వాడిన పదాలు అసభ్యంగా ఉన్నాయని విచారణ బృందం నివేదికలో వివరించింది.

Updated Date - Jul 30 , 2024 | 03:18 AM

Advertising
Advertising
<