ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sand Lorries: ‘బాట్‌’తో బోల్తా

ABN, Publish Date - Aug 04 , 2024 | 04:01 AM

తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) ద్వారా ఇసుక తరలించే లారీల యజమానులు అడ్డదారుల్లో బుకింగ్‌లు చేసుకోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కొందరికే పదే పదే బుకింగ్‌ ఆర్డర్లు లభిస్తుండగా, ఇతరులు ఎన్ని పర్యాయాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకున్నా అవకాశం దక్కటం లేదు.

  • అడ్డదారుల్లో ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌

  • బాట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆసరాగా కొందరు

  • లారీ యజమానుల అక్రమాలు

  • ఇతరులకు దక్కని బుకింగ్‌లు

  • సైబర్‌ క్రైమ్‌కు టీజీఎండీసీ ఫిర్యాదు

  • తవ్వకాలు, తరలింపుపై డ్రోన్‌ నిఘా

హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) ద్వారా ఇసుక తరలించే లారీల యజమానులు అడ్డదారుల్లో బుకింగ్‌లు చేసుకోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కొందరికే పదే పదే బుకింగ్‌ ఆర్డర్లు లభిస్తుండగా, ఇతరులు ఎన్ని పర్యాయాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకున్నా అవకాశం దక్కటం లేదు. దీంతో చాలా మంది లారీల యజమానులు నెలకు ఒకటి, రెండు ట్రిప్పులన్నా తమకు అవకాశం ఇవ్వాలంటూ అధికారులను కోరుతున్నారు. సంస్థ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు, అధికారులు ఈ సమస్యపై ఐటీ నిపుణులను సంప్రదించగా, బాట్‌ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ తతంగం నడుస్తున్నట్లు తాజాగా వెల్లడైంది.


కంప్యూటర్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాల్లో ఉపయోగిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి తెలుసుకున్న ఇసుక లారీల ఓనర్లు.. టీజీఎండీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్‌ కోసం పడిగాపులు పడకుండా, అధికారులు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు ఆయా రీచ్‌ల నుంచి ఇసుక తరలించేందుకు బాట్‌ సాయంతో అవకాశాలు దక్కించుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఒకసారి లారీ ఓనర్‌ తన దరఖాస్తును కంప్యూటర్‌ సెంటర్‌లో అప్‌లోడ్‌ చేసుకుంటే ఆ తరువాత పదే పదే హిట్‌ చేస్తూ బాట్‌ సాయంతో బుకింగ్‌ పొందేందుకు అవకాశం ఉందన్నారు. కొన్ని కంప్యూటర్‌ సెంటర్ల నిర్వాహకులు ఒక్కో బుకింగ్‌కు రూ.5000 చార్జ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.


రాష్ట్రంలో 45 వేల లారీలు ఇసుక తరలింపు కోసం పనిచేస్తున్నాయని, ఈ విషయంలో లారీ ఓనర్లమధ్య వివాదాలు తలెత్తుతుండటంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు, ఇసుక రీచ్‌ల వద్ద అక్రమ తవ్వకాలను నిలువరించేందుకు, స్టాక్‌ యార్డుల నుంచి ఇసుక తరలింపుపై నిఘా ఉంచేందుకు త్వరలో డ్రోన్లు వినియోగించనున్నామన్నారు. ఒకటి, రెండు నెలల్లో దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అనిల్‌కుమార్‌ తెలియజేశారు. ఒక డ్రోన్‌ 8 గంటల పాటు పర్యవేక్షిస్తుందని, దాంట్లో ఛార్జింగ్‌ అయిపోతున్నప్పుడే దానిని దించి, మరో డ్రోన్‌ను పైకి పంపిస్తామని మరో అధికారి వివరించారు.

Updated Date - Aug 04 , 2024 | 04:01 AM

Advertising
Advertising
<