TG News : డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్
ABN, Publish Date - Aug 28 , 2024 | 03:52 AM
తెలంగాణలో రోజురోజుకూ సీజనల్ వ్యాధులు పెరుగుతుండటం.. ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రోజురోజుకూ సీజనల్ వ్యాధులు పెరుగుతుండటం.. ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రజారోగ్య సంచాలకుడి ఆఽధ్వర్యంలో పని చేస్తుందని నిర్దేశించారు.
సీజనల్ వ్యాధుల కట్టడి పై మంత్రి దామోదర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. డెంగీ కట్టడిపై వైద్యశాఖలోని అన్ని విభాగాధిపతులు జిల్లాలను పర్యటించి నివేదికలు సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు సాధారణ బదిలీల తర్వాత కొందరు వైద్యులు బదిలీ అయిన చోట చేరలేదని, అటువంటి వారంతా తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి దామోదర ఆదేశించారు.
Updated Date - Aug 28 , 2024 | 03:52 AM