ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGSRTC: లాంగ్‌ రూట్లపై ఆర్టీసీ దృష్టి.. ఐటీ కారిడార్‌కు సర్వీసులు

ABN, Publish Date - Jul 25 , 2024 | 10:04 AM

కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur)కు గురువారం నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 రూట్‌లో రాజేంద్రనగర్‌ నుంచి అరాంఘర్‌ మీదుగా కొండాపూర్‌కు రెండు సర్వీసులు నడపనున్నారు.

- నేటి నుంచి కొత్తగా రెండు రూట్లలో బస్సులు

- 282కే రూట్‌లో ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‏లు

- 215 రూట్‌లో రాజేంద్రనగర్‌ నుంచి కొండాపూర్‌కు రెండు ఆర్డినరీ సర్వీసులు

ఐటీకారిడార్‌కు గ్రేటర్‌ శివారు ప్రాంతాల నుంచి రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది సొంత వాహనాలపై వెళ్తున్నారు. వీరిపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టిసారించింది. నేటి నుంచి ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌(Ghatkesar, Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు నూతన సర్వీసులను ప్రారంభించనుంది.

హైదరాబాద్‌ సిటీ: కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur)కు గురువారం నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 రూట్‌లో రాజేంద్రనగర్‌ నుంచి అరాంఘర్‌ మీదుగా కొండాపూర్‌కు రెండు సర్వీసులు నడపనున్నారు. లాంగ్‌ రూట్లను గుర్తించి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా డిపోల వారీగా కొత్త రూట్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మహిళను బెదిరించి రూ. 2.90లక్షలు లూటీ.. అసలేం జరిగిందంటే..


రెండు రూట్లలో..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొండాపూర్‌కు రెండు రూట్లలో బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తోంది. 282కే రూట్‌లో ఘట్‌కేసర్‌ నుంచి వయా యామనపేట, రాంపల్లి, రాంపల్లి ఎక్స్‌రోడ్‌, నాగారం, కుషాయిగూడ, ఎన్‌ఎఫ్‌సీనగర్‌, ఇండస్టియల్‌ఎస్టేట్‌, లాలాపేట, తార్నాక, శంకర్‌మఠ్‌, నారాయణగూడ, మాసబ్‌ట్యాంక్‌(Narayanaguda, Masabtank), ఎంపీఎక్స్‌రోడ్‌, నానల్‌నగర్‌, దర్గా, గచ్చిబౌలి, బయో-డైవర్సిటీ, ఐకియా, హైటెక్‌సిటీ, కొండాపూర్‌కు రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను గురువారం ఉదయం నుంచి నడుపుతోంది. ఘట్‌కేసర్‌ నుంచి మొదటి బస్సు ఉదయం 6.10 గంటలకు, చివరి బస్సు మధ్యాహ్నం 3.40 గంటలకు, కొండాపూర్‌ నుంచి మొదటి బస్సు ఉదయం 8.40 గంటలకు, చివరి బస్సు సాయంత్రం 6.25గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.


215 రూట్‌లో అరాంఘర్‌, రాజేంద్రనగర్‌ నుంచి వయా వీకర్‌ సెక్షన్‌కాలనీ, డైరీఫామ్‌, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, జ్యోతినగర్‌, బృందావనకాలనీ, దర్గా, ఖాజాగూడ ఎక్స్‌రోడ్‌, బయో-డైవర్సిటీ, ఐకియా, రాయదుర్గం, హైటెక్‌సిటీ/సైబర్‌టవర్స్‌, కొత్తగూడ ఎక్స్‌రోడ్‌ మీదుగా కొండాపూర్‌ వరకు రెండు బస్సులు నడుపుతున్నారు. ఆరాంఘర్‌ నుంచి మొదటి బస్సు ఉదయం 7.20 గంటలకు, చివరి బస్సు రాత్రి 9.15 గంటలకు, కొండాపూర్‌ నుంచి మొదటి బస్సు ఉదయం 8.30 గంటలకు, చివరి బస్సు రాత్రి 10.25 గంటలకు ఉంటుందని అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 10:50 AM

Advertising
Advertising
<