మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Victory Venkatesh: కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించండి..

ABN, Publish Date - May 08 , 2024 | 05:05 AM

‘‘భద్రాచలంలో శ్రీరాముడున్నాడు.. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని సినీహీరో వెంకటేశ్‌ పిలుపునిచ్చారు.

Victory Venkatesh: కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించండి..

  • ఖమ్మంలో హీరో వెంకటేశ్‌ రోడ్‌షో

  • భారీగా తరలివచ్చిన అభిమానులు

ఖమ్మం, మే 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘భద్రాచలంలో శ్రీరాముడున్నాడు.. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని సినీహీరో వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, కాంగ్రె్‌సకు ‘విక్టరీ’ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి నిలవడంతో ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ వెంకటేశ్‌ మంగళవారం ఖమ్మంలో భారీ రోడ్‌షో నిర్వహించారు.


మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్‌, సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి మయూరి సెంటర్‌ నుంచి వైరా రోడ్డు మీదుగా జడ్పీ సెంటర్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 6-10గంటలకు ప్రారంభమైన ర్యాలీ రాత్రి 8గంటల వరకు సాగింది. ఈ క్రమంలో జడ్పీసెంటర్‌ చౌరస్తాలో హీరో వెంకటేశ్‌ ప్రసంగించారు. రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి లోక్‌సభకు పంపించాలని కోరారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రఘురాంరెడ్డి విజయం కోసం కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

Updated Date - May 08 , 2024 | 05:05 AM

Advertising
Advertising