Telangana: లోక్‌సభ ఎన్నికలు.. ఓటింగ్ శాతం పెంపునకు ఈసీ కీలక నిర్ణయం..
ABN, Publish Date - Apr 03 , 2024 | 07:21 PM
తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ( Lok Sabha Elections ) ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషనర్ పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ( Lok Sabha Elections ) ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషనర్ పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బీఆర్కే భవన్లో ఓటర్ అవేర్‌నెస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రైల్వే పెట్రోలియం సంస్థల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైల్వే, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Sumalatha: బీజేపీలో చేరుతున్నా.. ఆయనకు మద్దతిస్తున్నా..
మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిఘా విస్తృతం చేస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలపై నిఘా పెంచాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఆయన గతంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 03 , 2024 | 07:23 PM