ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: జీనోమ్‌ వ్యాలీలో బయోప్రాసెస్‌ సెంటర్‌

ABN, Publish Date - Oct 24 , 2024 | 03:38 AM

అమెరికాకు చెందిన థెర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ‘బయోప్రాసెస్‌ డిజైన్‌ సెంటర్‌ (బీడీసీ)’ను నెలకొల్పబోతోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

  • థెర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ సంస్థ ప్రకటన

  • శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంవోయూ

  • గంగారెడ్డి హత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టబోమన్న మంత్రి

  • ‘ముఖాముఖి’లో ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన థెర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ‘బయోప్రాసెస్‌ డిజైన్‌ సెంటర్‌ (బీడీసీ)’ను నెలకొల్పబోతోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10 వేల చదరపు అడుగుల నిర్మిత స్థలంలో 2025 తొలి త్రైమాసికంలో డిజైన్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని మంత్రి తెలిపారు. బీడీసీ ఏర్పాటుతో స్థానిక ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. జీనోమ్‌ వ్యాలీ మూడో దశ విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయని వివరించారు. నవంబర్‌ 18న ఫార్మా రంగానికి అవసరమయ్యే కృత్రిమ మేధ సదస్సు జరుగుతుందని తెలిపారు.


  • ఎవరున్నా వదిలిట్టేది లేదు..

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్‌ నేత గంగారెడ్డి హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని శ్రీధర్‌బాబు అన్నారు. అత్యంత సన్నిహితుడైన నేత చనిపోవడంతో జీవన్‌రెడ్డి బాధలో ఉన్నారని చెప్పారు. గంగారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖిలో పాల్గొన్న శ్రీధర్‌బాబు.. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు తాను జీవన్‌రెడ్డిని కలిశానని, గంగారెడ్డి హత్యపై పూర్తి విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీకి, జిల్లా ఎస్పీకి ఆదేశాలిచ్చామన్నారు.


ఈ సందర్భంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జీవో నెంబర్‌ 46తో తాము ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు అభ్యర్థులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి ఈ నెల 26న సీఎ్‌సతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే వికలాంగులు, డీఎస్సీ అభ్యర్థులు, వీఆర్‌ఏలు తదితరులు కలిసి తమ సమస్యలను మంత్రికి వివరించారు. మొత్తం 328 వినతిపత్రాలు, ఫిర్యాదులు మంత్రి స్వీకరించారు.

Updated Date - Oct 24 , 2024 | 03:38 AM