ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఔటర్‌పై మరో 3 ఇంటర్‌చేంజ్‌లు

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:46 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు రానున్నాయి. హైదరాబాద్‌ మహానగరం విస్తరిస్తూ.. ఓఆర్‌ఆర్‌ వెంబడి కాలనీలు వెలుస్తుండడంతో..

  • జన్వాడ, కోహెడ, పడమటసాయిగూడల్లో ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు రానున్నాయి. హైదరాబాద్‌ మహానగరం విస్తరిస్తూ.. ఓఆర్‌ఆర్‌ వెంబడి కాలనీలు వెలుస్తుండడంతో.. ప్రజా అవసరాలకు అనుగుణంగా జన్వాడ, కోహెడ, పడమటసాయిగూడల్లో ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ-హెచ్‌జీసీఎల్‌ నిర్ణయించాయి. భవిష్యత్‌లో రానున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)కు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లతో అనుసంధానమయ్యేలా ఓఆర్‌ఆర్‌పై కొత్త ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఓఆర్‌ఆర్‌ను వినియోగించుకునేలా తొలినాళ్లలో 19 ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..! వీటి ద్వారానే వాహనదారులు నిర్ణీత ప్రదేశాల్లో ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లడం, దిగడం చేస్తుంటారు. నగరం విస్తరిస్తుండడంతో.. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


ఈ క్రమంలోనే గత ఏడాది నార్సింగ్‌, మల్లంపేట, కోకాపేట వద్ద ట్రంపెట్ల నిర్మాణానికి సంకల్పించింది. కోకాపేట ట్రంపెట్‌ ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా.. మిగతా రెండు అందుబాటులోకి వచ్చాయి. నార్సింగ్‌ ట్రంపెట్‌ ద్వారా గండిపేట, నార్సింగ్‌ పరిసర ప్రాంతాల వారు ఓఆర్‌ఆర్‌ను సులభంగా వినియోగించుకునేలా వెసులుబాటు కలిగింది. అలాగే మల్లంపేట ట్రంపెట్‌ వల్ల నిజాంపేట, బాచుపల్లి, మల్లంపేట, బౌరంపేట వాసులు ఓఆర్‌ఆర్‌ను వినియోగించుకోగలుగుతున్నారు. కోకాపేట ట్రంపెట్‌ పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. కొత్తగా జన్వాడ, కోహెడ, పడమటసాయిగూడ ప్రాంతాల్లో ఇంటర్‌చేంజ్‌ల ఏర్పాటు వల్ల.. నగరం మూడు వైపుల వారికి ఉపయుక్తంగా ఉండనుంది. జన్వాడ ఇంటర్‌చేంజ్‌ కోకాపేటకు ఈదుల నాగులపల్లికి మధ్యలో ఉంటుంది. కోహెడ ఇంటర్‌చేంజ్‌ పెద్ద అంబర్‌పేట-బొంగులూరు మధ్యలో రానుంది. ఘట్‌కేసర్‌-కీసర మధ్యలో పడమటసాయిగూడ ఇంటర్‌చేంజ్‌ ఏర్పాటు కానుంది.

Updated Date - Sep 20 , 2024 | 04:46 AM