ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore: మత్తు మజా.. మస్త్‌ మజా..

ABN, Publish Date - May 21 , 2024 | 04:03 AM

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్‌ నటులు, మోడల్స్‌ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు.

  • హైదరాబాద్‌ వ్యాపారి బర్త్‌ డే సందర్భంగా బెంగళూరులోని ఫాం హౌస్‌లో రేవ్‌ పార్టీ

  • పార్టీలో ఏపీ రాజకీయ, సినీ ప్రముఖులు.. విమానాల్లో తరలించిన నిర్వాహకులు

  • అర్ధరాత్రి దాటినా తాగేసి చిందులు.. 75 శాతంపైగా ఏపీ, తెలంగాణ వాసులే

  • కన్నడ సీరియల్‌ నటులు, మోడల్స్‌ సైతం.. భారీగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఐదుగురిపై కేసు

  • పార్టీ వద్ద ఏపీ మంత్రి కాకాణి స్టిక్కర్‌ ఉన్న వాహనం.. టాలీవుడ్‌లో మళ్లీ ప్రకంపనలు

  • శ్రీకాంత్‌ పేరు కూడా వెలుగులోకి.. అలాంటి అలవాట్లు లేవని వివరణ ఇచ్చిన నటుడు

బెంగళూరు, హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్‌ నటులు, మోడల్స్‌ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు. పార్టీలో భారీగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు బెంగళూరు సీసీబీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఫాంహౌ్‌సపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతోపాటు.. టాలీవుడ్‌ నటులు, మోడల్స్‌ మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో సదరు వ్యాపారి.. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీ పరిధిలోని జీఆర్‌ ఫాంహౌ్‌సలో బర్త్‌ డే పార్టీ పేరుతో రహస్యంగా రేవ్‌ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది.


ఈ పార్టీకి హాజరైన వారిలో తెలుగు రాష్ర్టాల రాజకీయ నేతలు, సినీ, టీవీ నటులు, మోడల్స్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. పార్టీలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ వినియోగించినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన పార్టీ రాత్రి 12 గంటలకు ముగియాల్సి ఉన్నా.. ఆ తర్వాత కూడా డీజేలతో హోరెత్తించడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీంతో స్థానికులు హెబ్బగూడి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బెంగళూరు సీసీబీ (సిటీ క్రైమ్‌ బ్రాంచి) పోలీసులు ఈ ఫాంహౌ్‌సపై దాడి చేసి పార్టీలో పాల్గొన్న సుమారు 100 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 75 శాతం మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వాసులని వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని సమాచారం. కన్నడ సీరియల్‌ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్‌ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తోపాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కారుపై ఉన్న స్టిక్కర్‌ నిజమైనదో కాదో పోలీసులు తేల్చుతారన్నారు. ఎలక్ర్టానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వైద్య పరీక్షలు..

ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్‌ కోసం ఫౌం హౌస్‌ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకూ చెల్లించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? వారిలో ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియరాలేదు. అందుకోసం మెడికల్‌ టెస్టులు నిర్వహించడానికి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించినట్లు ఎలకా్ట్రనిక్‌ సిటీ పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ వారికి ప్రస్తుతం వైద్యపరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.


పార్టీలో లేనన్న హేమ... ఉందన్న పోలీసులు..?

పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్‌ సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్‌ ఉన్నట్లు తేలడంతో పాటు.. ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. మీడియాలో వస్తున్న కథనాలు తెలుసుకున్న హేమ.. రేవ్‌ పార్టీలో తాను పాల్గొనలేదని, హైదరాబాద్‌లోనే ఫాంహౌ్‌సలో చిల్‌ అవుతున్నానని ఓ వీడియో రిలీజ్‌ చేశారు. బెంగళూరులో పట్టుబడినట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. అయితే సాయంత్రానికి నటి హేమ తమ అధీనంలోనే ఉందని బెంగళూరు పోలీసులు వెల్లడించినట్టు వార్తలొచ్చాయి. హేమ రిలీజ్‌ చేసిన వీడి యో నిజం కాదని, అందరినీ తప్పుదోవ పట్టించడానికి యత్నించినట్లు పోలీసులు తెలిపినట్టు సమాచారం.


నాకు పార్టీలకు వెళ్లే అలవాటు లేదు: శ్రీకాంత్‌

బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలో పట్టుబడ్డ వారిలో ప్రముఖ తెలుగు సినీనటుడు శ్రీకాంత్‌ కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో వెంటనే స్పందించిన శ్రీకాంత్‌.. హైదరాబాద్‌లోని తన ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక వీడియో విడుదల చేశారు. నాకు పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటులేదని పేర్కొన్నారు. ఎక్కడైనా బర్త్‌డే పార్టీలకు వెళ్లినా కొద్దిసేపు ఉండి వెంటనే వచ్చేస్తానన్నారు. అయితే బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డ వారిలో ఒక వ్యక్తి అచ్చం నాలాగే కనిపించడంతో మీడియా మిత్రులు పొరపాటుపడి ఉంటారని, అందులో వారి తప్పేంలేదని వీడియోలో స్పష్టం చేశారు.

Updated Date - May 21 , 2024 | 04:03 AM

Advertising
Advertising