ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaggareddy : కేటీఆర్‌.. నువ్వో బేవకూఫ్‌

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:36 AM

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌ ఒక బేవకూఫ్‌ అని అన్నారు.

  • సీఎం రేవంత్‌ను తిడతావా?.. ఆయనను కెలుకుడెందుకు? తిడితే కేసులు పెట్టుడెందుకు?

  • నీ సోషల్‌ మీడియా ఓ దండుపాళ్యం గ్యాంగ్‌

  • బుర్రకు తెలివిలేక రేడార్‌ స్టేషన్‌కు భూమి కేటాయిస్తూ జీవో ఇచ్చినవా?

  • నేను, సీఎం రేవంత్‌ నాటుకోడి తీరైతే.. నువ్వు బాయిలర్‌ కోడి టైపు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌ ఒక బేవకూఫ్‌ అని అన్నారు. కేటీఆర్‌ సోషల్‌ మీడియా బ్యాచ్‌.. దండుపాళ్యం గ్యాంగ్‌లా మారిందంటూ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ని హౌలా అని మాట్లాడుతుంటే తామెందుకు ఊరుకుంటామని ప్రశ్నించారు. సీఎం ఏది మాట్లాడినా వక్రీకరించే పనిలో కేటీఆర్‌, హరీశ్‌ ఉన్నారని విమర్శించారు. ‘‘సీఎంను తిట్టుడెందుకు? ఆయన తిడితే కేసులు పెట్టుడెందుకు? రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ లెక్క అయ్యపేరు చెప్పుకొని సీఎం కాలేదు. ఆయనకు ఫుట్‌పాత్‌ నుంచి తెలుసు. నేను కూడా ఫుట్‌పాత్‌ నుంచి వచ్చినోడినే. కేటీఆర్‌కు ఇవన్నీ తెలియకుండా కేసీఆర్‌ నాజూకుగా పెంచిండు.

నేను, సీఎం రేవంత్‌రెడ్డి నాటుకోడి తీరైతే.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి టైపు’’ అని జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దామగుండంలో రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సీఎం రేవంత్‌, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ శంకుస్థాపన చేయడంపై కేటీఆర్‌ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు రాజకీయ జ్ఞానం ఉందో, లేదో కూడా అర్థం కావట్లేదన్నారు. దామగుండాన్నే నేవీ ఎందుకు ఎంచుకుందో కేటీఆర్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. ఈస్టేషన్‌ నుంచి వెయ్యి కిలోమీటర్ల వర కు నేవీ సిగ్నల్స్‌ పంపిచే అవకాశం ఉంటుందన్నారు.


  • చెట్లున్న విషయం అప్పుడు గుర్తులేదా?

దామగుండంలో రేడార్‌ స్టేషన్‌కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూమిని కేటాయించినప్పుడు అక్కడ 9 లక్షల చెట్లు ఉన్న విషయం కేటీఆర్‌కు గుర్తులేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అన్ని లక్షల చెట్లు పోతాయని తెలిసి కూడా ఎందుకు జీవో ఇచ్చారని నిలదీశారు. రేడార్‌ స్టేషన్‌ కోసం ఎన్ని చెట్లను తొలగిస్తే అంతే సంఖ్యలో చెట్లను పక్కన నాటాలని ఆ జీవోలో ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద చల్లడమే కేటీఆర్‌ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘‘పదేళ్లపాటు రాజభోగాలు అనుభవించిన కేటీఆర్‌.. ఇప్పుడవన్నీ దూరం కావడంతో పిచెక్కి మాట్లాడుతున్నడు. మూసీ అక్కడే పుట్టిందంటున్న కేటీఆర్‌కు.. భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఆ సంగతి గుర్తుకు రాలేదా?’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలోని నాలుగైదు రాష్ట్రాలకు ఎన్నికల ఫండింగ్‌ చేసిన కేటీఆర్‌ తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు.

‘‘కర్ణాటక ఎన్నికల సమయంలో కుమారస్వామికి మీరు డబ్బులు పంపలేదా? నవీన్‌ పట్నాయక్‌కూ ఫండింగ్‌ చేయలేదా? కేజ్రీవాల్‌కూ ఫండింగ్‌ చేసినందుకే కదా మీ చెల్లెల్ని బీజేపీ జైల్లో పెట్టింది? మేము ఎదురుదాడి చేయట్లేదని తమాషా చేస్తున్నవా? కంట్రోల్‌లోనైనా ఉండు.. లేకుంటే బేవకూఫ్‌ మాటలు బంద్‌ పెట్టుకో’’ అంటూ కేటీఆర్‌ను జగ్గారెడ్డి హెచ్చరించారు.

Updated Date - Oct 23 , 2024 | 04:36 AM