Cross Wheel: ప్రాణాలు తీసిన క్రాస్‌వీల్..
ABN, Publish Date - Nov 04 , 2024 | 05:07 AM
తిరుపతిలోని శిల్పారామంలో ఆదివారం విషా దం చోటుచేసుకుంది. క్రాస్‌వీల్ బాక్సు ఊడి పోవడంతో 20 అడుగుల ఎత్తుపై నుంచి పడి ఓ మహిళ చనిపోగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
గాలిలో విరిగిన క్రాస్‌వీల్ బాక్స్
20 అడుగుల ఎత్తునుంచి
కిందపడి ఓ మహిళ దుర్మరణం
మరొక మహిళకు తీవ్రగాయాలు
తిరుపతి శిల్పారామంలో దుర్ఘటన
తిరుచానూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శిల్పారామంలో ఆదివారం విషా దం చోటుచేసుకుంది. క్రాస్‌వీల్ బాక్సు ఊడి పోవడంతో 20 అడుగుల ఎత్తుపై నుంచి పడి ఓ మహిళ చనిపోగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి సుబ్బారెడ్డినగర్‌కు చెందిన లోకేశ్వరి (25), చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన గౌతమి స్నేహితులు. ఆదివారం కావడంతో వారిద్దరూ మరికొందరితో కలిసి శిల్పారామానికి వచ్చారు. క్యాంటీన్ వద్ద క్రాస్‌వీల్ (జెయింట్ వీల్ తరహా) ఎక్కారు. లోకేశ్వరి, గౌతమి ఒకే బాక్సులో కూర్చున్నారు.
క్రాస్ వీల్ వేగంగా తిరుగుతుండగా వీరిద్దరూ కూర్చున్న బాక్సు ఉన్నట్టుండి విరిగిపోయింది. దీంతో 20 అడుగుల ఎత్తు నుంచి వీరిద్దరూ కింద పడిపోయారు. ఇద్దరినీ ఆటోలో రుయా కు తరలించగా.. లోకేశ్వరి అప్పటికే మృతి చెం దిందని వైద్యులు ధ్రువీకరించారు. గౌతమిని మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రాస్‌వీల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 05:07 AM