ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TSAT: గూప్‌-1 మెయిన్స్‌ కోసం టీ-శాట్‌ పాఠాలు

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:53 AM

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు టీ-శాట్‌ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుందని ఆ సంస్థ సీఈవో బోదపల్లి వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు టీ-శాట్‌ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుందని ఆ సంస్థ సీఈవో బోదపల్లి వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. టీ-శాట్‌.. మెయిన్స్‌ అభ్యర్థుల కోసం 750 ఎపిసోడ్లను సిద్ధం చేసిందని ఆయన వెల్లడించారు. పాఠ్యాంశాలు ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 19 వరకు ప్రసారమయ్యే విధంగా షెడ్యూల్‌ విడుదల చేసినట్లు తెలిపారు.


అరగంట నిడివిగల పాఠ్యాంశాలు రోజుకు ఐదు గంటల చొప్పున 10 ఏపిసోడ్లు 75 రోజులపాటు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లలో ప్రసారమవుతాయని చెప్పారు. టీ-శాట్‌ నిపుణ చానల్‌లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తిరిగి మరుసటి రోజు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు విద్యాచానల్‌లో ప్రసారం చేస్తామని తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 04:53 AM

Advertising
Advertising
<