ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

B.R. Naidu: తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు సహిం..చం

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:19 AM

తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరించారు.

  • సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరించిన టీటీడీ చైర్మన్‌

  • తెలంగాణ నేతపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి

తిరుమల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరించారు. తిరుమలలో తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల విషయంలో భేదం చూపిస్తున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ గురువారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో టీటీడీ చైర్మన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో గురువారం అర్ధరాత్రి ఓ పోస్ట్‌ చేశారు.


‘తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. రాజకీయంగా తిరుమలను ఎవరు వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించాం. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆయనపై చర్యలకు ఆదేశిస్తున్నాం’ అంటూ పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 04:19 AM