ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala Nageswara Rao: : 15న మూడో విడత రుణమాఫీ

ABN, Publish Date - Aug 07 , 2024 | 06:03 AM

స్వాతంత్ర దినోత్సవాన.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌ చేతుల మీదుగా మూడో విడత రుణ మాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

  • ఖమ్మం జిల్లా వైరా సభలో 2 లక్షలు మాఫీ చేయనున్న సీఎం

  • రేషన్‌ కార్డు లేనివారికి.. పాస్‌బుక్‌తో కుటుంబం నిర్ధారణ

  • మాఫీపై తప్పుడు ప్రచారం బీఆర్‌ఎస్‌, బీజేపీకి తగదు: తుమ్మల

  • ఖమ్మం జిల్లా వైరా సభలో 2 లక్షలు మాఫీ చేయనున్న సీఎం

  • అక్షర దోషాలు, ఆధార్‌, బ్యాంకర్ల తప్పిదాలు, ఎర్రర్లున్నా సరిచేసి మాఫీ

  • మాఫీపై తప్పుడు ప్రచారం బీఆర్‌ఎస్‌, బీజేపీకి తగదు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర దినోత్సవాన.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌ చేతుల మీదుగా మూడో విడత రుణ మాఫీ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభ దీనికి వేదిక కానుందన్నారు.

రెండు విడతల్లో లక్షన్నర వరకు మాఫీ చేశామని, ఈసారి సున్నా నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో మంగళవారం వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ ఇతర అనుబంధ శాఖలపై సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు.

‘‘రెండు విడతలమాఫీలో 30వేల ఖాతాలకు సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. కొన్ని బ్యాంకు లు పొరపాటున కొన్ని ఖాతాల వివరాలు పంపలేదు. ఐదేళ్ల నుంచి రుణాలు తీసుకున్న రైతుల వివరాలు ఇవ్వాలని 32 బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ మాఫీ చేసిన ఖాతాలతో పాటు కొన్ని కుడి ఎడమగా అవే 40 లక్షల ఖాతాలు పంపించారు. బ్యాంకర్ల డేటా ప్రకారం 25-26 లక్షల రైతుకు టుంబాలను రుణ వి ముక్తులను చేస్తున్నాం.

బ్యాంకర్ల తప్పిదాలున్నా, ఆధార్‌ ఎర్రర్లు ఉన్నా, అక్షర దోషాలున్నా అన్నీ సవరిస్తా’మని తెలిపారు. అప్పులున్న ఖాతాలు, తీర్చిన ఖాతాలు, తీర్చని ఖాతాల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటితో ఏఈవోలు, ఏవోలు రైతుల వద్దకు వెళ్లి ఎర్రర్లు సరిచేసి మాఫీ చేస్తారని ప్రకటించారు.

రేషన్‌ కార్డు లేకపోయినా పాస్‌బుక్‌ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని తెలిపారు. తొలి విడతలో 17 వేల ఖాతాలు ఎర్రర్‌ వచ్చాయని, వాటిలో 10 వేల ఖాతాలను సరిచేశామని, రూ.84 కోట్లు తిరిగి రాగా రూ.44 కోట్లు ఇచ్చేశామని, మిగతావీ ఖాతాలు సరిచేసి ఇస్తామని చెప్పారు. 2లక్షల వరకు మాఫీ పూర్తయిన తర్వాత మిగిలిన రైతులకు మాఫీ చేసే బాధ్యతను వ్యవసాయ శాఖ తీసుకుంటుందని వివరించారు.

మాఫీ ఎందుకు కాలేదో కారణాలు సహా.. శాఖ వద్ద ఉన్న యాప్‌లో రైతుల వివరాలన్నీ ఉన్నాయని, 15 తర్వాత వాటిని సరిచేస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిపివేసిన పంటల బీమా పథకానికి ఈ ఖరీ్‌ఫలోనే టెండర్లు పూర్తిచేసి, రైతులకు పైసా ప్రీమియం భారం లేకుండా అమలు చేస్తామన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతుల విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉన్నదని ఆయన చెప్పారు.


కృష్ణమ్మ కరుణ.. ఆయకట్టుకు ఢోకా లేదు

వాతావరణ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా ప్రాజెక్టులన్నీ ఏక కాలంలో నిండడం గొప్ప విషయమని తుమ్మల పేర్కొన్నారు. ఆయకట్టుకు ఢోకా లేదని చెప్పారు. వానాకాలం 2 నెలలు ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రుణమాఫీపై తప్పుడు ప్రచారంతో, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. మాఫీ కాని రైతులు వాట్సప్‌కు ఫిర్యాదు చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు ఇస్తున్నారని, రూ.2 లక్షల మాఫీ పూర్తయినట్లు ప్రకటించిన తర్వాత మిగిలి నవారుంటే వివరాలు తెప్పించుకొని ఇవ్వాలని, వాటినీమాఫీ చేస్తామని చెప్పారు.

ఏనాడూ రైతుల బాగోగులు చూడని ఎన్డీఏ ప్రభు త్వం మాఫీని ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఈ నెలకు సరిపోయేలా ఎరువుల నిల్వలు ఉన్నాయని, పూర్తి సరఫరాకు కేంద్రం అనాసక్తిగా ఉన్నప్పటికీ, నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మంగళవారం కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లుగా తెలిపారు.

Updated Date - Aug 07 , 2024 | 06:03 AM

Advertising
Advertising
<