ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Thummala: 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు..

ABN, Publish Date - Jun 01 , 2024 | 05:55 AM

ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి అంతర్జాతీయ పంటల సంస్థ(కాలిఫోర్నియా, అమెరికా) డైరెక్టర్‌ మెర్సిడెజ్‌ జోన్స్‌తో పాటు స్థానిక నిర్వహకులు ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యలు శుక్రవారం వివరించారు.

  • విదేశీ శాస్త్రవేత్తల రాక: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి అంతర్జాతీయ పంటల సంస్థ(కాలిఫోర్నియా, అమెరికా) డైరెక్టర్‌ మెర్సిడెజ్‌ జోన్స్‌తో పాటు స్థానిక నిర్వహకులు ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యలు శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఈ సదస్సుకు దాదాపు 150 మంది విదేశీ వరి ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఫిలిప్పీన్స్‌) నుండి ప్రముఖ వరి శాస్త్రవేత్తలు రానున్నారని తెలిపారు.


అలాగే ఇతర రాష్ట్రాల నుండి 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తారని, రాష్ట్రంలోని 30 మంది అభ్యుదయ రైతులు, 30 మంది రైస్‌ మిల్లర్లు కూడా పాల్గొంటారని తెలిపారు. దేశీయ వరి ఎగుమతిదారులు, విదేశీ దిగుమతి దారులతో నేరుగా సంప్రదింపులు చేసుకునే అవకాశం ఉంటుందని, శాస్త్రవేత్తల ద్వారా విత్తనోత్పత్తిలో అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, విత్తనాల సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఆరాతీశారు. సెక్రటేరియట్‌ నుంచి ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Updated Date - Jun 01 , 2024 | 05:55 AM

Advertising
Advertising