Union Minister: పంద్రాగస్టు తర్వాత.. నగరాభివృద్ధిపై సమీక్ష
ABN, Publish Date - Aug 07 , 2024 | 11:11 AM
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్(Hyderabad) అని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రేటర్ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Minister Kishan Reddy) కోరారు. మంగళవారం బౌద్ధనగర్ డివిజన్ పార్శిగుట్ట న్యూఅశోక్‌నగర్ కమ్యూనిటీహాల్‌పై నూతనంగా నిర్మించిన రెండో అంతస్తును ఆయన ప్రారంభించారు.
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్(Hyderabad) అని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రేటర్ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Minister Kishan Reddy) కోరారు. మంగళవారం బౌద్ధనగర్ డివిజన్ పార్శిగుట్ట న్యూఅశోక్‌నగర్ కమ్యూనిటీహాల్‌పై నూతనంగా నిర్మించిన రెండో అంతస్తును ఆయన ప్రారంభించారు. అనంతరం స్ధానిక ఆలయాల్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
‘హైదరాబాద్(Hyderabad) అంటే హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్(Hi-Tech City, Madapur, Kondapur) కాకుండా నిజమైన బస్తీలు, పాతబస్తీలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్ధ, మురికినీటి కాల్వలు, పార్కులను మెరుగుపర్చాలి. వీటిపై దృష్టి కేంద్రీకరించాలని సీఎంను కోరుతున్నా. పంద్రాగస్టు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తాం. నత్తనడకన సాగుతున్న పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. జీహెచ్‌ఎంసీ(GHMC), జలమండలి, రైల్వే, మైనార్టీ తదితర విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు’ అని పేర్కొన్నారు.
బీజేపీ సికింద్రాబాద్ కన్వీనర్ కందాడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌గౌడ్, ప్రధానకార్యదర్శి మేకల సారంగపాణి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవిప్రసాద్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ స్వరూపగౌడ్, ముఖ్యనాయకులు మేకల కీర్తి, రాజశేఖర్‌రెడ్డి, కనకట్ల హరి, ప్రభుగుప్తా, శారదామల్లేష్, మద్దెర్ల శ్యామ్‌సుందర్, రాజేశ్వరరావు, సాయిదత్తు, సత్యనారాయణ, బబ్లూలతోపాటు కార్పొరేటర్లు కంది శైలజ, సుప్రియనవీన్‌గౌడ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మొక్కల పంపిణీ
‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా కేంద్రమంత్రి మహిళలకు మొక్కలు అందజేశారు. సికింద్రాబాద్ సర్కిల్ ఉపకమిషనర్ సుభా్‌షరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఈ శశికాంత్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి
ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!
Updated Date - Aug 07 , 2024 | 11:11 AM