ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Usha Chilukuri: మార్మోగుతున్న ఉషా చిలుకూరి పేరు

ABN, Publish Date - Jul 19 , 2024 | 04:40 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఎంపిక చేయడంతో ఆయన సతీమణి ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగిపోతోంది.

  • అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున

  • ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ సతీమణి మూలాలు ఏపీలో

విశాఖపట్నం, హైదరాబాద్‌, జూలై 18: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఎంపిక చేయడంతో ఆయన సతీమణి ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగిపోతోంది. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి.. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ఉష పూర్వీకుల మూలాలు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉండగా.. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 96 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.


‘నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి ద్వారా ఉషతో నాకు కుటుంబ సంబంధం ఉంది. ఆమె నాకు మనవరాలు అవుతుంది. ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన నా మరిది రామశాస్త్రి మనవరాలే ఆమె’ అని శాంతమ్మ చెప్పారు. రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. వారు శాన్‌ డియాగోలో ఇంజనీరింగ్‌, మాలిక్యులర్‌ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తే ఉషా చిలుకూరి. ఆమె భర్త జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన విషయం తనకు తెలిసి సంతోషించానని, ఈ ఎన్నికల్లో వాన్స్‌ గెలవాలని కోరుకుంటున్నానని శాంతమ్మ చెప్పారు. ఉష తాత రామశాస్త్రి కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని వడ్డూరు. చెన్నైలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఉషా మేనత్త శారద కూడా.. జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 04:40 AM

Advertising
Advertising
<