ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam Kumar Reddy: ఒకే కుటుంబ పాలనకు కాలం చెల్లింది

ABN, Publish Date - Dec 08 , 2024 | 04:22 AM

‘వన్‌ మ్యాన్‌ షో.. వన్‌ ఫ్యామిలీ రూల్‌కు కాలం చెల్లింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 11 మంది మంత్రులు పవర్‌ ఫుల్‌. 24/7 పనిచేస్తున్నాం.

  • కృష్ణాలో 70% వాటాను సాధించి తీరుతాం

  • కాంగ్రెస్‌ పాలనలో మంత్రులందరికీ అధికారాలు

  • నిజాయితీ, పారదర్శకతతో పాలన అందిస్తున్నాం

  • జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘వన్‌ మ్యాన్‌ షో.. వన్‌ ఫ్యామిలీ రూల్‌కు కాలం చెల్లింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 11 మంది మంత్రులు పవర్‌ ఫుల్‌. 24/7 పనిచేస్తున్నాం. నిజాయతీ, పారదర్శకతో స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక పాలన అందిస్తున్నాం. గత పదేళ్లలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ పాలన కన్నా.. మేము వచ్చిన ఏడాదిలోనే ఎంతో చేశాం. ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వ చ్చాయి. మంచి చేస్తే విపక్ష నేతలు చప్పట్లు కొడతారని నేను అనుకోవడం లేదు. అసూయ, నిరాశతో వాళ్లు విమర్శలు చేస్తూనే ఉంటారు’ అని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నీటి పారుదల శాఖను పునర్‌ వ్యవస్థీకరణ చేసి, పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం ఇస్తుంటే.. 50ు దారి మళ్లుతోందని, అందుకే రేషన్‌షాపుల ద్వారా ఈ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సన్నం బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. కాంగ్రెస్‌ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన్ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. మంత్రి ఉత్తమ్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..


  • కాళేశ్వరం ప్రాజెక్టును ఏం చేయనున్నారు?

బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. వాళ్లే డిజైన్‌ చేశారు. వాళ్లే కట్టారు. రాష్ట్రానికి గుండెకాయ మేడిగడ్డ అని ప్రగల్భాలు పలికారు. వారు అధికారంలో ఉన్నప్పుడే అది కుంగిపోయిది. ఈ ఏడాది చుక్క నీరు కూడా నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నిర్మాణంలో లోపాలతో మూడు బ్యారేజీలు వైఫల్యం చెందాయి. ఈ అంశంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ)తో ఈ నెల 9వ తేదీ తర్వాత మళ్లీ భేటీ అవుతాం. మా పాలనలో తప్పులకు ఆస్కారమే ఉండదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.


  • నీటి పారుదల శాఖను ఎలా సంస్కరిస్తున్నారు?

గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖను అస్తవ్యస్థం చేశారు. ఒక్క నియామకమూ చేపట్టలేదు. కాలువల నిర్వహణను గాలికొదిలేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి కీలక పోస్టులు కట్టబెట్టారు. వచ్చే రెండేళ్లలో దేశంలోనే నంబర్‌వన్‌గా రాష్ట్ర నీటిపారుదలశాఖను తీర్చిదిద్దుతాం. మేము వచ్చాక 700మంది ఏఈఈలను నియమించాం. మరో 1300 మంది నియమించనున్నాం. లష్కర్ల నియామకాలు చేపడతాం.

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రాధమ్యాలు ఏంటి?

అసూయ, జలసితో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. వన్‌ మ్యాన్‌ షో, వన్‌ ఫ్యామిలీ రూల్‌కు కాలం చెల్లింది. మేము 11 మంది మంత్రులం ఉన్నాం. మా మధ్య ఎలాంటి తేడాల్లేవు. ఎవరి పరిధి మేరకు వారికి అధికారాలున్నాయి. ప్రజాసంక్షేమం, అభివృద్ధే.. మాకు ప్రాధామ్యాలు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు, మూసీ పునరుజ్జీవం, మెట్రో రెండో దశ విస్తరణ, రూ.22 వేల కోట్లతో రీజినల్‌ రింగు రోడ్డు.. ఇలా ఎన్నో పనులు చేపట్టనున్నాం. గత ప్రభుత్వం దురుద్దేశంతో ప్రాణహితను పక్కనపెట్టింది. రానున్న వేసవిలో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నాం.

  • మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఏమైనా తప్పులు జరిగాయా?

మూసీ పునరుజ్జీవం డీపీఆరే సిద్ధం కాలేదు. డీపీఆర్‌ సిద్ధం కాకముందే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం తగదు. ఈ పథకం అమలు క్రమంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటాం. మూసీ పునరుజ్జీవంతో ‘క్లీన్‌ అండ్‌ మోర్‌ వాటర్‌’ వస్తుంది.


  • రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారు...?

ఈ సంక్రాంతి(జనవరి)లో లేదా ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని భావిస్తున్నాం. మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటాం. ఏటా 24 లక్షల టన్నుల దొడ్డుబియ్యాన్ని రేషన్‌షాపుల ద్వారా ఇస్తుంటే... అందులో 50ు కూడా వాడటం లేదు. బియ్యమంతా పక్కదారి పడుతోది. వచ్చే రెండునెలల్లో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమగ్ర మార్పులు తేనున్నాం. సన్నాలు మిల్లింగ్‌ చేసి.. రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు అందిస్తాం. తెలంగాణ ఏర్పడే నాటికీ పౌరసరఫరాల సంస్థ అప్పు రూ.4 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.58 వేల కోట్లకు చేరింది. ఏడాదికాలంలో రూ.11 వేల కోట్ల అప్పును తగ్గించి.. రూ.47వేల కోట్లకు చేర్చాం. ఏపీలో 100 శాతం బ్యాంకు గ్యారెంటీతో ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తున్నారు. మేము కూడా క్రమక్రమంగా 100 శాతం బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్నాకే మిల్లర్లకు ధాన్యం ఇస్తాం.


  • కృష్ణా జలాల్లో వాటా సంగతేంటి?

కృష్ణా జలాల్లో వాటాను గత ప్రభుత్వం విస్మరించింది. ఉమ్మడి ఏపీకి గంపగుత్తగా 811 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తే.. అందులో 512 టీఎంసీలు ఏపీ వాడుకోవడానికి, 299 టీఎంసీలు తెలంగాణ వాడుకోవడానికి అంగీకారం తెలిపింది. ఏపీలో పోతిరెడ్డిపాడు విస్తరణ బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగింది. దెబ్బతిన్న తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటాం. కృష్ణా జలాల్లో 70ు వాటాను సాధించడమే లక్ష్యం గా పోరాటం చేస్తున్నాం. ఆర్నెల్లల్లో ట్రైబ్యునల్‌ తీర్పు వెలువడే అవకాశం ఉంది. తీర్పు వెలువడగానే పాలమూరు-రంగారెడ్డితో పాటు ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తిలకు నీటి కేటాయింపులు చేసుకుంటాం.

Updated Date - Dec 08 , 2024 | 04:23 AM