ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

V. Hanmantha Rao: మత చిచ్చుపెట్టే మోదీకి ధ్యానమెందుకు?: వీహెచ్‌

ABN, Publish Date - May 31 , 2024 | 03:53 AM

మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రధాని మోదీకిధ్యానమెందుకని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. మత విద్వేషాలు సృష్టించే ఆయన మూడ్రోజుల పాటు ఽధ్యానం చేయడంతో వచ్చే ప్రయోజనమేం లేదని వ్యాఖ్యానించారు. మోదీని దేవదూతగా అభివర్ణిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రధాని మోదీకిధ్యానమెందుకని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. మత విద్వేషాలు సృష్టించే ఆయన మూడ్రోజుల పాటు ఽధ్యానం చేయడంతో వచ్చే ప్రయోజనమేం లేదని వ్యాఖ్యానించారు. మోదీని దేవదూతగా అభివర్ణిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరుతో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ చేస్తున్న విన్యాసాలు, డ్రామాలు మానుకుంటే మంచిదని టీపీసీసీ సీనియర్‌ ఉపాఽధ్యక్షుడు జి.నిరంజన్‌ హితవు పలికారు.


తెలంగాణ అంటే తమ సొంత సొత్తులా మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు ప్రజలంతా కలిసి పోరాడితేనే తెలంగాణ సిద్ధించిందనే విషయాన్ని విస్మరించి బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు విస్మయపరుస్తున్నాయని గజ్జెల కాంతం అన్నారు. కేసీఆర్‌ ఒక్కడు పోరాడితేనే తెలంగాణ వచ్చిందా..? అని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ సర్కారుపై విషప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌ మండిపడ్డారు. నిజాయితీకి నిలువుటద్దమైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - May 31 , 2024 | 03:53 AM

Advertising
Advertising