Inquiry: కొండపోచమ్మ సాగర్‌పై విజిలెన్స్ గురి
ABN, Publish Date - Oct 08 , 2024 | 04:26 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గురిపెట్టింది. రిజర్వాయర్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు సోమవారం విజిలెన్స్ అధికారులు జలసౌధలో సోదాలు నిర్వహించారు.
జలసౌధలో సంబంధిత పత్రాల కోసం సోదాలు
సంబంధిత ఫైళ్లు అందించాలని అధికారులకు నిర్దేశం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గురిపెట్టింది. రిజర్వాయర్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు సోమవారం విజిలెన్స్ అధికారులు జలసౌధలో సోదాలు నిర్వహించారు. ప్యాకేజీ-14లోని కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌తోపాటు రెండు దశల పంప్‌హౌ్‌సలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి హైపవర్ కమిటీ నిర్ణయాలు, సైట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టు, సమీక్ష సమావేశాల పత్రాలు, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ, ఐబీఎం కమిటీ సమావేశాల మినిట్స్, నిర్మాణ వ్యయానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన పరిపాలన పరమైన అనుమతులు, రిజర్వాయర్ నిర్మాణంతో ముడిపడిన ఉత్తర ప్రత్యుత్తరాలు, 2008 నుంచి ఇప్పటిదాకా జరిగిన అకౌంటెంట్ జనరల్, కాగ్ నివేదికలను పరిశీలించిన అధికారులు... కొన్ని పత్రాలను వెంట తీసుకెళ్లారు.
ఇందుకు సంబంధించిన సమగ్ర ఫైళ్లను అందించాలని నిర్దేశించారు. మరోవైపు.. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి సిద్ధమవుతున్న విజిలెన్స్ అధికారులు.. సోమవారం ఈఎన్సీ(ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు నుంచి పలు వివరాలు సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలేంటి? 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఓఅండ్ ఎం పనులు చేయకపోవడమేనా? బ్యారేజీ కుంగడానికి కారణం ఎవరు? అని ఆరా తీసినట్లు సమాచారం. 2019 జూన్‌లో బ్యారేజీ ప్రారంభమైన తర్వాత 2021 దాకా డిఫెక్ట్ లయబుల్టీలో ఉందని, తర్వాత మూడేళ్లపాటు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. కాగా, మంగళవారం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) మాజీ చీఫ్ ఇంజనీర్(సీఈ) టి.శ్రీనివాస్, డైరెక్టర్ వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ వి.ఫణిభూషణ్‌శర్మ నుంచి విజిలె న్స్ వివరాలు సేకరించనుంది.
Updated Date - Oct 08 , 2024 | 04:26 AM