Vishveshwar Reddy: ప్రజలందరూ మోదీని ఆశీర్వదించాలి
ABN, Publish Date - May 10 , 2024 | 11:46 AM
ప్రజలందరూ మోదీని నిండుమనస్సుతో ఆశీర్వదించి మూడోసారి ప్రధానిని చేయాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Vishveshwar Reddy) విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
- చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల: ప్రజలందరూ మోదీని నిండుమనస్సుతో ఆశీర్వదించి మూడోసారి ప్రధానిని చేయాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Vishveshwar Reddy) విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనను ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. బీజేపీ(BJP) గెలుపు కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చెబుతున్న మాటాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్. రత్నం, చేవెళ్ల ఎంపీపీ. విజయలక్ష్మి, శివసేన రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కృష్ణాగౌడ్, ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం
బీజేపీ ఎస్టీ మోర్చా సమావేశంలో..
పరిగి: చేవెళ్లలో తాను రెండు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పరిగిలోని కేఎస్ఆర్ గార్డెన్‌లో జరిగిన బీజేపీ ఎస్టీ మోర్చా సమావేశంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.ప్రహ్లాద్‌రావు, వేముల పెంటయ్యగుప్తా, పరమేశ్వర్‌రెడ్డి, ఎస్టీ మోర్చా నాయకులు గోవింద్‌నాయక్, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: MLA: పాలనను మరచి కేసీఆర్‌ను తిట్టడానికి పోటీపడుతున్నారు..
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 11:46 AM