CM Revanth: వరంగల్‌ను మరో హైదరాబాద్ చేస్తా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 29 , 2024 | 05:45 PM
ద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (శనివారం) వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
హనుమకొండ: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక హామీ ఇచ్చారు. ఈరోజు (శనివారం) వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ అయ్యేలా ఉండాలని సూచించారు. రింగ్ రోడ్డు నుంచి టెక్స్‌టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలని సూచించారు.
స్మార్ట్ సిటీ మిషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతీ 20 రోజులకోసారి ఇన్‌చార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని .. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Updated Date - Jun 29 , 2024 | 06:05 PM