ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: జనగామ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు..

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:01 PM

జనగామ బీఆర్ఎస్‌లో వర్గపోరు మళ్లీ రాజుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మెుదలైన వేడి ఇంకా చల్లారలేదు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడి వేస్తే భగ్గమంటుంది. తాజాగా ఎమ్మెల్సీ పోచంపల్లి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పల్లా వర్గీయులు చింపేశారంటూ పోచంపల్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జనగామ: జనగామ బీఆర్ఎస్‌లో వర్గపోరు మళ్లీ రాజుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మెుదలైన వేడి ఇంకా చల్లారలేదు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడి వేస్తే భగ్గమంటుంది. తాజాగా ఎమ్మెల్సీ పోచంపల్లి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పల్లా వర్గీయులు చింపేశారంటూ పోచంపల్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తమ నేత జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. పల్లా వర్గం వారు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. 2023అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడ్డారు. అధిష్ఠానం పల్లాకే సీటు కేటాయించింది. అప్పట్నుంచి ఇరు వర్గాల మధ్య పోరు మెుదలైంది. నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. ఇద్దరు నేతలూ జనగామలో తమ ఆధిపత్యం కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


అయితే ఎన్నికల సందర్భంగా మెుదలైన వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు. పల్లా, పోచంపల్లి వర్గాలుగా చీలిపోయిన కార్యకర్తలు, నేతలు ఎప్పుడు ఎవరిపై ఎవరు దాడులు చేసుకుంటారో అని నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే వివదాన్ని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి పరిణామాలు మంచిది కాదని ఆ పార్టీ నేతలే పలువురు చర్చించుకుంటున్నారు. వర్గపోరు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. మరోపైపు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 05:53 PM

Advertising
Advertising
<