ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: వరంగల్‌లో హోటళ్ల బాగోతం.. మరీ ఇంత దారుణమా?

ABN, Publish Date - Jul 06 , 2024 | 06:59 PM

నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. పురుగులు పట్టిన కిరాణా సరకులు, కళ్లిపోయిన మాంసం, మళ్లీ మళ్లీ వాడే వంట నూనె చూసి షాకయ్యారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, స్ట్రీట్ ఫుడ్ ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండలోని థౌజండ్ పిల్లర్స్ హోటల్ సహా పలు పేరుపొందిన హోటళ్లల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

వరంగల్: నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food Safety Officials) అవాక్కయ్యారు. పురుగులు పట్టిన కిరాణా సరకులు, కళ్లిపోయిన మాంసం, మళ్లీ మళ్లీ వాడే వంట నూనె చూసి షాకయ్యారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, స్ట్రీట్ ఫుడ్ ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండలోని థౌజండ్ పిల్లర్స్ హోటల్ సహా పలు పేరుపొందిన హోటళ్లల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.


అధికారుల సోదాల్లో పలు హోటళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏ ఒక్క హోటల్ యాజమాన్యం కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఫుడ్ సేఫ్టీ జోనల్ ఆఫీసర్ అమృత శ్రీ తేల్చి చెప్పారు. తనిఖీల్లో కుళ్లిపోయిన చికెన్, కాల పరిమితి ముగిసిన మసాలా దినుసులు, మళ్లీమళ్లీ ఉపయోగిస్తున్న వంటనూనె గుర్తించారు. పప్పు దినుసులు, పల్లీలు, ఉప్మారవ్వ సహా మరికొన్ని కిరాణ సరుకుల్లో పురుగులను గుర్తించారు. క్యాలిటీ పాటించని యాజమాన్యంపై జోనల్ అధికారి అమృత శ్రీ మండిపడ్డారు. నాణ్యమైన ఆహార పదార్థాలను ప్రజలకు సరఫరా చేయని, క్వాలిటీ పాటించని యాజమాన్యాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.


ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం మెుదలైన నేపథ్యంలో ప్రజలు జ్వరాలు, జలుబు, దగ్గు, డయేరియా వంటి రోగాలతో ప్రభుత్వాసుపత్రులు నిండిపోతున్నారు. కొంతమంది కల్తీ ఆహారం తిని ఆస్పత్రుల పాలవుతున్నారు. హోటళ్లల్లో ఆహార పదార్థాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్యత విషయంలో తగిన ప్రమాణాలు పాటించడం లేదంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలపై చెలగాటం ఆడే ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.

Updated Date - Jul 06 , 2024 | 07:46 PM

Advertising
Advertising
<