ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: భారీ వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష

ABN, Publish Date - Sep 02 , 2024 | 09:45 AM

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్‌ఎన్‌బీ గెస్ట్ హౌస్‌లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Minister Seethakka

మహబూబాబాద్, సెప్టెంబర్ 2: భారీ వర్షాలు రాష్ట్ర ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను అడిగి మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!



మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్‌ఎన్‌బీ గెస్ట్ హౌస్‌లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క (Minister Seethakka) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, వాగులు ప్రమాద స్థాయిలో ఉండడం వల్లన ప్రజలు అటు వైపు వెళ్ళకుండా పోలీసుల బందోబస్త్ నిర్వహించాలన్నారు.

CM Chandrababu: జోరు వానలో అర్ధరాత్రి సింగ్ నగర్‌కు సీఎం చంద్రబాబు


మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం, రాళ్ళు వాగు ప్రమాదంపై మంత్రి ఆరా తీశారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సూధీర్ రాంనాధ్ కేకన్‌లకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అధికారులు అందరు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలపై సంబంధిత అధికారులు త్వరగా సర్వే చేసి రిపోర్ట్ అందజేయాలన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Pakistan: రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..

NRI: ముగిసిన ఆప్త 16వ వార్షికోత్సవం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 10:53 AM

Advertising
Advertising