TG News: హన్మకొండలో వింత ఘటన.. ఆ వ్యక్తి చేసిన పనితో పోలీసులు సహా అందరూ ఆశ్చర్యం
ABN, Publish Date - Jun 10 , 2024 | 10:04 PM
హన్మకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. నీటిలో ఓ వ్యక్తి దేహం స్థానికులకు కనిపించింది. దీంతో అతడు చనిపోయాడునుకొని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు చూడగా ఆ వ్యక్తి ఏం చక్కగా నీటిలో సేదతీరుతూ కనిపించాడు.
హన్మకొండ: హన్మకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. నీటిలో ఓ వ్యక్తి దేహం స్థానికులకు కనిపించింది. దీంతో అతడు చనిపోయాడునుకొని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు చూడగా ఆ వ్యక్తి ఏం చక్కగా నీటిలో సేదతీరుతూ కనిపించాడు. దీంతో పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ పట్టణంలోని రెండో డివిజన్ రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కేయూ పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించారు. దీంతో పోలీసులు, 108 సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లారు. 108 సిబ్బంది, కేయూ పోలీసులు నీటిలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో అతను మంచిగా నీటిలో జలకాలాడుతూ కనిపించాడు. సదరు వ్యక్తి నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ వ్యక్తిగా గుర్తించారు. పోలీసుల సమయం, 108 సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృథా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
Updated Date - Jun 11 , 2024 | 05:22 PM