KTR: డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు మోదీ జీ?
ABN, Publish Date - May 01 , 2024 | 03:59 AM
తెలంగాణలో ఛోటాభాయ్ (రేవంత్‌రెడ్డి) అక్రమంగా డబుల్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు? మోదీ జీ’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
చూసీచూడనట్లు వదిలేస్తే రేప్దొద్దున డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు సహకరిస్తారనే ఛోటాభాయ్‌ను క్షమిస్తున్నారా?
కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి, మోదీది ఒకేమాట : కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణలో ఛోటాభాయ్ (రేవంత్‌రెడ్డి) అక్రమంగా డబుల్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు? మోదీ జీ’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ తన ప్రసంగంలో డబుల్ ఆర్ ట్యాక్స్ అని పేర్కొనడంపై మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ‘మీ రాజకీయ ప్రత్యర్థులపై.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు.. మరి ఛోటాభాయ్ నిర్వాకాన్ని ఎందుకు క్షమిస్తున్నారు?
ఇప్పుడు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లను చూసీ చూడనట్టు వదిలేస్తే.. రేపు డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనేనా?’ అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా.. బడే భాయ్ మోదీది, ఛోటాభాయ్ రేవంత్‌ది ఒకే మాట ఒకే బాట అంటూ ఎద్దేవా చేశారు. ఒకరు ప్రాజెక్టును బలిచేయాలని చూస్తుంటే. మరొకరు తమిళనాడు కోసం తాకట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసే ఈ ఫెవికాల్ బంధంపై యుద్థానికి తెలంగాణ సమాజం సిద్థమైందని పేర్కొన్నారు.
‘గోదావరి జలాలను తరలించుకుని పోవాలనే కాళేశ్వరంపై ఈ కక్ష., మీకు, మీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులపై ఎందుకీ వివక్ష. లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణకు వచ్చారు.. అదే పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకు పాతరేశారు’ అని ఆరోపించారు. తెలంగాణకు విభజన చట్టం తాలూకు హక్కులను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే.. సభల్లో బీజేపీ వాగ్దానాలను ప్రజలెలా విశ్వసిస్తారు? అని నిలదీశారు.
అవినీతిపరులకు బీజేపీని కేరా్‌ఫగా మార్చారని, ప్రత్యర్థులపై కక్షగట్టి పెడుతున్న కేసులను.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న అక్రమ అరెస్టులను.. యావత్ భారత సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసిందని, ఇప్పుడు బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని చవిచూస్తోందన్నారు.
Updated Date - May 01 , 2024 | 03:59 AM