ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Khammam MP Congress seat: ఇంతకీ ఆ అదృష్టవంతులు ఎవరో..!

ABN, Publish Date - Mar 21 , 2024 | 08:23 PM

తెలంగాణ రాజకీయానికి కోటగుమ్మం. అలాంటి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రేవంత్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు పోటాపోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. తన భార్య నందినికి ఎంపీ టికెట్ ఇప్పించుకొనేందుకు దేశ రాజధాని హస్తినలో పార్టీ అధిష్టానం వద్ద తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని సమాచారం. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన సోదరుడు ప్రసాదరెడ్డికి ఇదే టికెట్ కోసం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహాయ సహకారాలు కొరుతున్నారని తెలుస్తోంది.

ఖమ్మం: తెలంగాణ రాజకీయానికి కోటగుమ్మం. అలాంటి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రేవంత్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు పోటాపోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. తన భార్య నందినికి ఎంపీ టికెట్ ఇప్పించుకొనేందుకు దేశ రాజధాని హస్తినలో పార్టీ అధిష్టానం వద్ద తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని సమాచారం. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన సోదరుడు ప్రసాదరెడ్డికి ఇదే టికెట్ కోసం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహాయ సహకారాలు కొరుతున్నారని తెలుస్తోంది. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అయితే తన కుమారుడు యుగంధర్‌ను రాజకీయ వారసుడిగా తెరపైకి తీసుకొచ్చేందుకు రానున్న ఎన్నికలనే వేదికగా చేసుకొని.. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటడంతో.. పార్టీలోని అగ్రనేతలంతా కీలక లోక్‌సభ స్థానాలపై దృష్టి సారించారు. ఆ క్రమంలో ఖమ్మం ఎంపీ టికెట్ దక్కించుకొనేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే ఖమ్మం ఎంపీ టికెట్ తనకేనంటూ.. హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి భావిస్తున్న తరుణంలో.. ఆమెకు రాజ్యసభ సీటు కేటాయిస్తూ ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె పెద్దల సభకు వెళ్లిపోయారు. దాంతో ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో తమకు లైన్ క్లియర్ అయిందని మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల భావించి తమ వాళ్ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారని తెలుస్తోంది.

మరోవైపు.. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ నైసర్గిక స్వరూపం విభిన్నమైనది. సరిహద్దు జిల్లా కావడంతో పొరుగు రాష్ట్రం ఏపీ రాజకీయాలు కూడా ఇక్కడ ఎంతోకొంత ప్రభావం చూపుతున్న దాఖలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును గులాబీ బాస్ ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో నామాను సమర్థవంతంగా ఢీకొట్టే నాయకుడి కోసం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే కాకుండా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకులు కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. ఖమ్మం సీటుపై తీవ్ర పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో భట్టి భార్య నందిని లేదా తుమ్మల కుమారుడు యుగంధర్, లేదంటే పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారా? లేదంటే వీరేవరిని కాదని ఎవరైనా సీనియర్ నేతకు ఎంపీ టికెట్ కేటాయిస్తారా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదీ ఇది కాదు మధ్యేమార్గంగా తుమ్మల, పొంగులేటి, భట్టిలను ఒకచోట కూర్చొబెట్టి వారి సూచిస్తున్న అభ్యర్థుల్లో ఒకరిని అందరి అమోదంతో బరిలో నిలుపుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని లోక్‌సభ సీట్లు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మం లోక్‌సభ సీటుపైనే ఫడింది. ఏదీ ఏమైనా.. ఖమ్మం లోక్‌సభ టికెట్ దక్కించుకోనే ఆ అదృష్టవంతులు ఎవరనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 08:23 PM

Advertising
Advertising