ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: బీజేపీతో జోడి కడితే కవిత జైలుకెళ్లేదా..?

ABN, Publish Date - May 03 , 2024 | 05:07 AM

‘బీజేపీతో జత కట్టనందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పి కుట్రపూరిత కేసులు పెట్టిస్తోంది.. బీజేపీతో బీఆర్‌ఎస్‌ జోడి కడితే ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్లేదా..?

  • ఆ పార్టీతో జతకట్టనందుకే ఈడీ కేసులు

  • రాష్ట్రానికి పట్టిన శని రేవంత్‌: హరీశ్‌రావు

గుమ్మడిదల/హత్నూర, మే 2: ‘బీజేపీతో జత కట్టనందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పి కుట్రపూరిత కేసులు పెట్టిస్తోంది.. బీజేపీతో బీఆర్‌ఎస్‌ జోడి కడితే ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్లేదా..?’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి తరఫున సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, హత్నూరలో కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి ఒక శనిలా పట్టాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వచ్చి కరువు తెచ్చిందని, వారి పాలనలతో మంచినీళ్లకు కూడా కష్టం వచ్చిందన్నారు.


అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రె్‌సదేనని విమర్శించారు. ‘కాంగ్రె్‌సకు శిక్ష పడాలంటే 13వ తేదీన గుంపు మేస్త్రీ గూబ గుయ్‌మనేలా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళితే.. అక్కడ దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడు. ఓట్లు తిట్లు తప్ప పేద ప్రజలకు చేసింది శూన్యం. మాట్లాడితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పడం లేదు. అంటే ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా..?’ అని ప్రశ్నించారు.

Updated Date - May 03 , 2024 | 05:07 AM

Advertising
Advertising