ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శంషాబాద్‌ విమానాశ్రయంలో మద్యం మత్తులో ప్రయాణికురాలి హల్‌చల్‌

ABN, Publish Date - Dec 30 , 2024 | 05:09 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికురాలు హల్‌చల్‌ చేసింది.

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికురాలు హల్‌చల్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీకి చెందిన అఫ్రిన్‌ ఖాన్‌ అనే మహిళ శనివారం రాత్రి ఇండిగో విమానంలో ముంబై వెళ్లడానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమెకు ఇద్దరు మగవారి మధ్య సీటు కేటాయించడంతో తనకు వేరే సీటు వేరే కేటాయించాలని సిబ్బందిని ఆమె కోరారు.


అందుకు నిరాకరించడంతో సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులతో ఆమె వాదనకు దిగింది. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్‌ అనంతరం ఆమెను ముంబైకి పంపించారు.

Updated Date - Dec 30 , 2024 | 05:09 AM