Yadadri Bhongir: భువనగిరి గురుకులంలో అమలుకాని కొత్త మెనూ
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:16 AM
నలభై శాతం పెరిగిన డైట్ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్‌ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.
కేర్ టేకర్ సస్పెన్షన్.. ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్
భువనగిరి టౌన్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నలభై శాతం పెరిగిన డైట్ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్‌ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు. దాంతో సదరు గురుకుల సిబ్బందిపై కలెక్టర్ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నీని ప్రారంభించిన అనంతరం గురుకులాన్ని తనిఖీ చేశారు.
పెరుగు నాణ్యంగా లేకపోవడం, మెనూ ప్రకారం కూరలు వండకపోవడం, డైనింగ్ హాల్‌లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నూతన డైట్‌ను ఎందుకు అమలు చేయడం లేదని, డైట్ చార్ట్‌ను డైనింగ్ హాల్‌లో ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. ఉడకబెట్టిన గుడ్ల పొలుసును విద్యార్థులతో తీయిస్తుండటంపై, అలాగే గుడ్డు పరిమాణంపై మండిపడ్డారు. నూతన డైట్ అమలులో నిర్లక్ష్యం చూపిన పాఠశాల కేర్ టేకర్ రమే్‌షను సస్పెండ్ చేసి, ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించారు.
Updated Date - Dec 17 , 2024 | 05:16 AM