ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: 2025 మార్చి నాటికి ‘యాదాద్రి’లో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:10 AM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో 2025 మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

  • భూనిర్వాసితులకు ఉద్యోగాలిస్తాం

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డిలతో కలసి వైటీపీఎస్‌ సందర్శన, సమీక్ష

దామరచర్ల, సెప్టెంబరు 11: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో 2025 మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి భట్టి.. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.10 గంటలకు వైటీపీఎ్‌సలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు వైటీపీఎ్‌సను సందర్శించి.. అధికారులతో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పరిశ్రమలో యూనిట్‌-2 ఆయిల్‌ సింక్రనైజేషన్‌ పనులు స్విచ్ఛాన్‌ చేసి భట్టి ప్రారంభించారు. అనంతరం అక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 చివరి నాటికి 5 యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపంతో ఆలస్యమైందని, ఫలితంగా ప్రభుత్వంపై పరిశ్రమపై అదనపు భారం పడిందన్నారు. డిసెంబరు చివరి నాటికి 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మరో 2 యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి యూనిట్‌ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.


తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జాతీయ హరిత ట్రైబున్యల్‌ క్లియరెన్స్‌ను తీసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ప్రజల నుంచి ఆమోదం తీసుకోవడంతో అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన తమకు ఉపాధి కల్పిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని మంత్రుల ఎదుట భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి స్పందిస్తూ.. భూములను త్యాగం చేసిన భూనిర్వాసితులకు మూడు నెలల్లో ఉద్యోగం కల్పించి వారికి ఆదుకుంటామని హామీనిచ్చారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌తో పాటు పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన వారి జాబితాను రూపొందించి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 04:10 AM

Advertising
Advertising