Share News

HYDRA: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌ను కూల్చేసిన హైడ్రా!

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:06 AM

హైడ్రా.. నాన్ స్టాప్‌గా దూసుకెళ్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతోంది.. ఎప్పుడొచ్చి బుల్డోజర్ ఇళ్లపై పడుతుందో అని కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా..

HYDRA: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌ను కూల్చేసిన హైడ్రా!

హైడ్రా.. నాన్ స్టాప్‌గా దూసుకెళ్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతోంది.. ఎప్పుడొచ్చి బుల్డోజర్ ఇళ్లపై పడుతుందో అని కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరీ కన్‌స్ట్రక్షన్‌కు నోటీసులు ఇచ్చి 15 రోజులు డెడ్ లైన్ విధించింది హైడ్రా. ఎన్ నుంచి జె వరకూ వచ్చిన హైడ్రా ఇప్పుడు ప్రజాప్రతినిధులను సైతం అస్సలు వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా ముందుకెళ్తోంది..


HYDRA.jpg

ఎవరైనా సరే..!

  • నాన్ స్టాప్‌గా దూసుకెళ్తున్న హైడ్రా

  • హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు షురూ

  • చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

  • ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

  • తాజాగా నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు

  • భాగ్యనగరంలోని మియాపూర్ హెచ్ఎంటీ హిల్స్ స్వర్ణపురిలో..

  • కత్వ చెరువు లక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌లో కూల్చివేతలు ప్రారంభం

  • స్వర్ణపురిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేత

  • నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కాటసాని

  • ముందుగా నోటీసులు జారీ చేసి మరీ కూల్చివేతలు


ranganath-hydra-comm.jpg

సండే.. కూల్చుడే!

  • ఒక్కరోజే భారీగా అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేయనున్న హైడ్రా

  • 30 టీమ్స్ సిద్ధం చేసిన హైడ్రా కమీషనర్ రంగనాథ్

  • 10 ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ


Hydrabad.jpg

విల్లాలు ఔట్!

  • మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

  • సున్నం చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేత

  • అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేస్తున్న హైడ్రా

  • మేడ్చల్ జిల్లా మల్లంపేట్‌లోనూ హైడ్రా కూల్చివేతలు

  • కత్వ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన విల్లాలు

  • భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు

  • గత వారం రోజుల క్రితం బిల్డర్లకు నోటీసులు జారీ చేసిన హైడ్రా

  • చెరువులోనే విల్లాలను నిర్మించడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు ఫిర్యాదులు

  • రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించిన కమిషనర్


Hydra-Villas.jpg

మూడు ప్రాంతాల్లో ఇలా..

  • సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు

  • ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్న అధికారులు

  • ప్రహరీ గోడను కూల్చి వేస్తున్న రెవెన్యూ ,హైడ్రా అధికారులు

  • మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు

  • సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు

  • చెరువు FTL, బఫర్ జోన్‌లలో భారీ షెడ్స్ భవనాలు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు

  • సున్నం చెరువుFTL లో ఉన్న సర్వే నంబర్లు 12,13,14,16..

  • పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న కబ్జాదారులు

  • భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

Hydra-Demolition-1.jpg


నో డౌట్.. కూల్చేస్తాం

  • జయభేరీ వ్యవహారంపై మీడియాతో హైడ్రా చీఫ్ రంగనాథ్

  • నానక్ రామ్‌గూడ రంగలాల్ చెరువులో మురళీ మోహన్..

  • జయభేరి నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం

  • ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించాం

  • వారంలో రోజుల్లో FTL లో నిర్మాణాలను తొలిగించేందుకు జయభేరి సంస్థ గడువు కోరారు

  • ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేస్తుంది.. : రంగనాథ్

MURALI.jpg

Updated Date - Sep 08 , 2024 | 10:19 AM