ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chiranjeevi: సీఎం రేవంత్‌తో భేటీకి చిరంజీవి దూరం.. కారణం ఇదే..

ABN, Publish Date - Dec 26 , 2024 | 01:15 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్‌తో పాటు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్దూ జొన్నలగడ్డ.. డైరెక్టర్స్ త్రివిక్రమ్, రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ఎందుకు రాలేదని అంతా అనుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ఈవెంట్స్‌కు అటెండ్ అవ్వాల్సి ఉండటం, పర్సనల్ షెడ్యూల్ ముందే ప్లాన్ చేసి ఉండటంతో భేటీకి మెగాస్టార్ రాలేకపోయారని తెలుస్తోంది.

సమయాభావం వల్లే సీఎం రేవంత్‌తో సమావేశానికి చిరు అటెండ్ అవ్వలేకపోయారని సమాచారం. అయితే మెగాస్టార్ రాకపోయినా రేవంత్‌తో మీటింగ్‌కు సంబంధించిన విశేషాలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారట. దీనిపై అవసరమైతే భవిష్యత్తులో ప్రభుత్వ పెద్దలతో కో-ఆర్డినేట్ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటారని మెగాస్టార్ టీమ్ నుంచి వినిపిస్తోంది.

Updated Date - Dec 26 , 2024 | 01:59 PM