నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

ABN, Publish Date - Aug 25 , 2024 | 09:59 AM

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 3 గంటలకు టీ.టీడీపీ నేతలతో పలు కీలకాంశాలపై చర్చించనున్నారు.

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 3 గంటలకు టీ.టీడీపీ నేతలతో పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.


తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌పై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయ‌నున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి నియామకంపై కూడా దృష్టి పెట్టనున్నారు. కాగా ప్రతి శనివారం, ఆదివారం తెలంగాణలోనే ఉంటానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్‌ వస్తున్నారు.

Updated at - Aug 25 , 2024 | 09:59 AM