ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ ఇలాకాలో రెచ్చిపోతున్న వైసీపీ అక్రమార్కులు..

ABN, Publish Date - Aug 19 , 2024 | 07:26 PM

అది జగన్(YS Jagan) రెడ్డి సొంత అడ్డా పులివెందుల(Pulivendula). అక్కడ వైసీపీ శ్రేణులు ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడినా అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అది జగన్ రెడ్డి హయాంలో అంటే ఒకే. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా వారు యథాతథంగా అక్రమాలు కొనసాగిస్తున్నారు.

పులివెందుల: అది జగన్(YS Jagan) రెడ్డి సొంత అడ్డా పులివెందుల(Pulivendula). అక్కడ వైసీపీ శ్రేణులు ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడినా అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అది జగన్ రెడ్డి హయాంలో అంటే ఒకే. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా వారు యథాతథంగా అక్రమాలు కొనసాగిస్తున్నారు. వారు అక్రమాలకు పాల్పడుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు. ఇప్పుడు పులివెందుల జనంలో ఇదే చర్చ జరుగుతోంది.


అసలు విషయానికి వస్తే పులివెందుల పట్టణంలో జగన్ ప్రభుత్వ హయాం నుంచీ వైసీపీ శ్రేణులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అడ్డదారిలో అక్రమ లేఅవుట్లు దందా కొనసాగిస్తున్నారు. కనీస అనుమతులు పొందకుండా ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా ఇష్టానుసారంగా అప్పుడు, ఇప్పుడు ప్లాట్ల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీతోపాటు గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే తరహా అనధికార లేఅవుట్లు వెలిశాయి. అప్పట్లో కొందరు రాజకీయ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ లేఅవుట్లు వేశారు. పలు చోట్ల సాగుకు అనువైన భూమిని కొనుగోలు చేసి లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా వందల సంఖ్యలో లేఅవుట్లు వెలిశాయి. రియల్ వ్యాపారులు జనాన్ని మభ్యపెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తూ వారిని మాయ చేస్తున్నారు. అయితే ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రం భౌవిష్యత్తులో తిప్పలు అనుభవం ఉన్నవారు చెప్తున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 07:48 PM

Advertising
Advertising
<