బిడ్డ జోలికి వచ్చారు.. భయమేసి.. మనోజ్ భావోద్వేగం |
ABN, Publish Date - Dec 11 , 2024 | 01:17 PM
కూర్చుని మాట్లాడుకుందామంటే.. దురుసుగా రిప్లైలు పెట్టారని హీరో మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి.. ప్రతి అంశాన్ని వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆగలేనన్నారు. ప్రతి విషయాన్ని వివరాస్తాని ఆయన పేర్కొన్నారు.
కూర్చుని మాట్లాడుకుందామంటే.. దురుసుగా రిప్లైలు పెట్టారని హీరో మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి.. ప్రతి అంశాన్ని వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆగలేనన్నారు. ప్రతి విషయాన్ని వివరాస్తాని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సపోర్ట్ అడిగినప్పుడు.. అలాగే 100కి కాల్ చేసినప్పుడు.. చోటు చేసుకున్న సంఘటనలను ఈ సందర్భంగా మంచు మనోజ్ వివరించారు. ఆ రోజు.. ఆ హీట్ మూమెంట్‌లో జరిగిన ఘటనపై మాట్లాడానన్నారు.
ఇంట్లో 10 కార్లు ఉన్నాయి.. ఇంటి నిండా మనుషులు ఉన్నారని.. కానీ తమ ఇంటికి 108 అంబులెన్స్ వచ్చిందని.. ఈ విషయం ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. ఆ విషయం పోలీసులకు సైతం తెలుసునన్నారు. కానీ ఈ విషయం మాత్రం బయటకు రాదని చెప్పారు. కానీ రికార్డుల్లో ఉంటుందని చెప్పారు. తనపై అబండాలు మోపుతున్నారని.. ఆ క్రమంలో ఇంట్లోని సీసీ కెమెరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కిరణ్, విజయ్‌పై యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్బంగా పోలీసులను మంచు మనోజ్ డిమాండ్ చేశారు. నాకు మా నాన్న దేవుడని మంచు మనోజ్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ రోజు ఏదైనే మీరు చూస్తున్నారో.. అది మా నాన్న కాదని మంచు మనోజ్ తెలిపారు. తాను అబద్దాలు ఆడే వాడిని కాదన్నారు. కావాలంటే.. తన గురించి ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని మీడియా ఎదుట మంచు మనోజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ అనే వ్యక్తిపై మంచు మనోజ్ పలు కీలక ఆరోపణలు చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 11 , 2024 | 01:21 PM