ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam Park: ప్రేమికులకు అనుమతి లేదు ఖమ్మం పార్కులో బోర్డులు

ABN, Publish Date - Dec 09 , 2024 | 07:02 AM

సహజంగా ప్రేమికులు పార్కుల చుట్టూ తిరగడం కామన్. దాదాపుగా ఏ పార్కులో చూసినా ప్రేమ జంటలు కనిపిస్తునే ఉంటాయి. కానీ ఖమ్మంలోని ఓ పార్కులో ప్రేమికులకు అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ప్రేమికులకు ప్రవేశం లేదు.

ఖమ్మం: సహజంగా ప్రేమికులు పార్కుల చుట్టూ తిరగడం కామన్. దాదాపుగా ఏ పార్కులో చూసినా ప్రేమ జంటలు కనిపిస్తునే ఉంటాయి. కానీ ఖమ్మంలోని ఓ పార్కులో ప్రేమికులకు అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ప్రేమికులకు ప్రవేశం లేదు. ప్రేమికులు ఎవరూ కూడా ఈ పార్కుకు రావడానికి వీలులేదంటూ చెప్పారు. మున్సిపల్ అధికారులు ఫ్రీడం పార్కులో ఏర్పాటు చేసిన బోర్డులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


పార్కులోకి వాకర్స్ కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే ప్రేమ జంటలు పార్కులో తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రేమికులు రావొద్దంటూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. మేము రోజు ఉదయం పార్కులో వాకింగ్ చేయడానికి వస్తుంటామని వాకర్స్ చెబుతున్నారు. పెద్ద పిల్లలు కూడా ఆడుకోవడానికి వస్తుంటారని చెప్పారు. అలాగే కొంతమంది ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారని అన్నారు. పార్క్‌కు రక్షణగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పార్క్‌కు ఉదయం 10 గంటల తర్వాత తాళం వేసి మళ్లీ సాయంత్రం ఐదు గంటలకు పార్క్‌ను తెరవాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల పార్క్‌లోకి గేదెలు కూడా రాకుండా ఉంటాయని అంటున్నారు. గేదెలు రావడం వల్ పార్కులో ఉండే మొక్కలు పాడు చేస్తాయని వాకర్స్ చెబుతున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 09 , 2024 | 07:02 AM