తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్..
ABN, Publish Date - Oct 31 , 2024 | 08:36 AM
అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. హైకమాండ్ అనుమతి తీసుకుని ముందుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువ కప్పారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో చేరికలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీకి ఒక్క సీటు రాలేదు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొద్ది రోజులకే ప్రభుత్వం కూలిపోతుందని ప్రతిపక్షాలు కామెంట్స్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందని ఎద్దేవా చేసినవారూ ఉన్నారు. దిన దిన గండం ఐదేళ్లు ఆయుస్సు అంటూ విపక్షాలు భయపెట్టాయి. దీంతో హస్తం పార్టీ నేతలు కంగారుపడ్డారు. తెలంగాణ ఆవిర్భవించిన పదేళ్లకు అధికారంలోకి వస్తే.. విపక్షాల ప్రకటనలతో ఆందోళనకు గురయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న హస్తం పార్టీ జాగ్రత్తపడింది. బీఆర్ఎస్ నేతల ప్రకటనలకు చెక్ పెట్టాలని భావించింది. ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించి చేరికలపై దృష్టి పెట్టింది.
అసెంబ్లీలో బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. హైకమాండ్ అనుమతి తీసుకుని ముందుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువ కప్పారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో చేరికలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీకి ఒక్క సీటు రాలేదు. దీంతో గులాబీ దళం పనైపోయిందని భావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఒక్కొక్కరిని కాకుండా ఒకేసారి 15 మందిని చేర్చుకోవాలని భావించింది. తద్వారా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం చేసుకోవచ్చని అనుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అనుసరిస్తున్న విధానం ఇదీ..
దీపావళికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
దీపావళి రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 31 , 2024 | 08:36 AM