Rahul Gandhi: మోదీ షేర్ మార్కెట్ల స్కాం.. జేపీసీతో విచారణకు డిమాండ్
ABN, Publish Date - Jun 06 , 2024 | 07:36 PM
ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల వేళ.. దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ, జూన్ 06: ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల వేళ.. దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై పార్లమెంటరీ సంయుక్త కమిటి (జేపీసీ)తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఈ సందర్బంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లకు ఆయన ప్రశ్నలు సంధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు.. వీరంతా స్టాక్ మార్కెట్ గురించి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు ఇలా కామెంట్లు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలో ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే ముందుకు వరకు బీజేపీ నేతలు చేసిన కామెంట్లను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా రాహుల్ గాంధీ తేదీలతో సహా వివరించారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2024 | 07:43 PM