విపక్షాలపై కేంద్రమంత్రి నిర్మల ఫైర్..

ABN, Publish Date - Jul 31 , 2024 | 07:11 AM

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించారన్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. 26 రాష్ట్రాల ఊసు లేనంత మాత్రాన ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించారన్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. 26 రాష్ట్రాల ఊసు లేనంత మాత్రాన ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని స్పష్టం చేశారు. గతంలో యూపీఏ పాలనలో బడ్జెట్ లెక్కలను సభ ముందుంచి విపక్షాలను కడిగిపారేశారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న ఆమె.. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి తిప్పికొట్టారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో ఆమె సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా కూటమి’ తీరు సరికాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

1.70 లక్షల ఎకరాలు కొట్టేశారు

గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 31 , 2024 | 07:13 AM