-
-
Home » Andhra Pradesh » Today Breaking News Telangana and AP Assembly Budget Sessions Highlights Live Updates in Telugu News Tuesday 18th March 2025 Suri
-

Breaking News: మహాకుంభమేళాపై ప్రధాని మోదీ కీలక ప్రకటన
ABN , First Publish Date - Mar 18 , 2025 | 08:11 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-18T12:26:46+05:30
మహా కుంభమేళాపై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకన
మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన యూపీ ప్రభుత్వాన్ని,కార్మికులను అభినందించిన మోదీ
మహా కుంభమేళ విజయవంతానికి చాలా కష్టపడ్డారు.
దైవ,ప్రజా సంకల్పంతో మహా కుంభమేళా వేడుకగా జరిగింది
-
2025-03-18T12:22:11+05:30
లోక్‌సభలో ప్రధాని
మహాకుంభమేళా విజయవంతమైంది
ప్రయోగ్‌రాజ్ ప్రజలకు ధన్యవాదాలు
మహాకుంభమేళా ఐక్యతా సందేశాన్ని అందిస్తోంది
-
2025-03-18T11:10:07+05:30
నాగ్‍పూర్ అల్లర్లు.. 47 మంది అరెస్టు..
మహారాష్ట్ర: నాగ్‍పూర్ మహల్ ప్రాంతంలో సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ
రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో జేసీబీ, పలు వాహనాలకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు, ఇప్పటివరకూ 47 మంది అరెస్టు
ఘర్షణలో 12 మందికి పైగా పోలీసులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
హింసాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న పోలీసులు
-
2025-03-18T10:59:11+05:30
పురుషులకూ స్వయం సహాయక సంఘాలు: మంత్రి నారాయణ
పురుషులకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మగవారికి స్వయం సహాయక సంఘాల గ్రూపులున్నాయి: మంత్రి నారాయణ
మహిళా గ్రూపులకు ఉన్న తరహాలోనే పురుషుల సంఘాలకూ విధివిధానాలు ఉన్నాయి: మంత్రి నారాయణ
దేశంలోని 25 నగరాల్లో మహిళలతోపాటు సమానంగా పురుషులకూ కేంద్రం వర్తింపచేస్తుంది: మంత్రి నారాయణ
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పురుషులకూ స్వయం సహాయక సంఘాలున్నాయి: మంత్రి నారాయణ
ఏప్రిల్ 2025 నాటికి అన్ని నగరాల్లో వర్తింప చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది: మంత్రి నారాయణ
బలహీన వర్గాల పురుషులకు మాత్రమే ప్రస్తుతం ఈ గ్రూపులున్నాయి: మంత్రి నారాయణ
దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో 1,949 గ్రూపులు ఉన్నాయి: మంత్రి నారాయణ
కానీ విశాఖ, విజయవాడలో ఇప్పటివరకూ 818 గ్రూపులు ఏర్పాటు అయ్యాయి: మంత్రి నారాయణ
-
2025-03-18T10:51:06+05:30
న్యూజిలాండ్ ప్రధానితో రాహుల్ భేటీ..
ఢిల్లీ: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో ఏంపీ రాహుల్ గాంధీ భేటీ
మర్యాదపూర్వకంగా న్యూజిలాండ్ ప్రధానిని కలిసిన రాహుల్ గాంధీ
-
2025-03-18T10:44:27+05:30
అసెంబ్లీ ఫొటో సెషన్..
అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో గ్రూప్ ఫొటోలు దిగనున్న ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు గ్రూప్ ఫొటోలు దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
గ్రూప్ ఫొటో అనంతరం సీఎం డిప్యూటీ పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుతో విడివిడిగా ఫొటో సెషన్
అనంతరం అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
2025-03-18T10:37:05+05:30
ఎంపీ ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్టు..
హైదరాబాద్: బేజీపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పురోగతి
నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న నగర పోలీసులు
రహస్య ప్రదేశంలో నిందితుడిని విచారిస్తున్నట్లు సమాచారం
పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేడు చోరీ కేసుపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం
-
2025-03-18T10:34:07+05:30
దొంగనోట్ల కలకలం..
ఏలూరు: వేలేరుపాడు మండలంలో దొంగ నోట్ల కలకలం
వృద్ధురాలికి అప్పు చెల్లించే క్రమంలో రూ.500 నోట్లు ఐదు ఇచ్చిన వ్యక్తులు
షాపునకు వెళ్లగా నకిలీ నోట్లు అని తేలడంతో లబోదిబోమన్న వద్ధురాలు
భయంతో తన దగ్గర ఉన్న నకిలీ నోట్లను షాపు వద్ద పడ వేసి వెళ్లిపోయిన వృద్ధురాలు
-
2025-03-18T10:30:31+05:30
బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు ఉక్కుపాదం..
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్
ఇప్పటికే 11 మంది టీవీ నటులు, యూట్యూబర్స్‌పై కేసులు నమోదు చేసిన పంజాగుట్టు పోలీసులు
ఆ 11 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం
ఇవాళ యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ ఇచ్చి విచారణకు పిలవనున్న పోలీసులు
-
2025-03-18T10:26:58+05:30
ఏలూరులో దారుణం..
ఏలూరు: ఉండి మండలంలో వివాహితపై పలుమార్లు లైంగికదాడి
వీడియోలు తీసి, డబ్బు ఇవ్వాలని బాధితురాలికి బెదిరింపులు
దఫదఫాలుగా రూ.2.5 లక్షలు ఇచ్చినా ఆగని బెదిరింపులు
నిందితులు యర్రంశెట్టి రవి, సోమేశ్వరరావులపై ఫిర్యాదు
కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని పోలీసుల సూచన
ఏలూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు
-
2025-03-18T09:47:47+05:30
ప్రధాని మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబుపై సమీక్ష..
అమరావతి: మధ్యాహ్నం 2:30 గంటలకు సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ప్రధానంగా కొనసాగనున్న చర్చ
అమరావతి పనుల ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించేందుకు నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
ప్రధాని పర్యటన సందర్భంగా సభా స్థలం ఎంపిక, ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో సమావేశం
సమీక్షా సమావేశానికి హాజరుకానున్న మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు
-
2025-03-18T09:42:56+05:30
సీఐడీ కస్టడీకి సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి
గుంటూరు: నేడు సీఐడీ కస్టడీకి సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించనున్న సీఐడీ
మీడియా సమావేశాల్లో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై కేసు నమోదు
సీఐడీ కేసులో గుంటూరు జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని
నేడు గుంటూరు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్‍పై విచారణ
-
2025-03-18T09:25:01+05:30
రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏకంగా పోలీసులపైనే దాడులు..
ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు తిరుణాళ్లలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాళ్లలో టీడీపీ, జనసేన, వైసీపీ ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు
టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా వైసీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టే చర్యలు
వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసురుసూ రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
పరిస్థితి అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా రాళ్లు, వాటర్ ప్యాకెట్లు విసిరిన వైసీపీ మూకలు
దాడులు అడ్డుకున్న నలుగురు పోలీసులకు, స్థానికులకు స్వల్పగాయాలు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
రెచ్చగొట్టేలా దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు
-
2025-03-18T09:03:09+05:30
దారుణ హత్య..
శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం గ్రామంలో దారుణం
గాలి అప్పలరెడ్డి తన భార్య నాగమ్మను (40) కత్తితో పొడిచి హత్య
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు
కుటుంబకలహాలే హత్యకు కారణమని తెలిసిన స్థానికులు
వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను చంపిన భర్త
-
2025-03-18T08:57:21+05:30
నేటి నుంచి ప్రజాప్రతినిధుల ఆటల పోటీలు
అమరావతి: నేటి నుంచి ప్రజాప్రతినిధుల ఆటల పోటీలు
పోటీల కోసం ముస్తాబైన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
మూడు గంటలకు పోటీలను ప్రారంభించనున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
పోటీల నిర్వహణకు 200 మందిని నియమించిన ప్రభుత్వం
మొత్తం 12 విభాగాల్లో పోటీలు నిర్వహణ
ఇప్పటివరకూ 140 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు ఆడేందుకు రిజిస్ట్రేషన్
చివరి రోజు పోటీల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-
2025-03-18T08:53:01+05:30
సినిమాల పేరుతో యువతులకు ఎర..
హైదరాబాద్: సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి అనే మహిళ అరెస్టు
ఫిలిమ్ కాస్టింగ్ మేనేజర్‍నని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నాగరాణి
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలకు ఎర వేస్తున్న నాగరాణి
సినిమాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతున్న నాగరాణి
విశ్వసనీయ సమాచారంతో నాగరాణిని అరెస్టు చేసి రిమాండ్‍కు తరలించిన పోలీసులు
నాగరాణి కోసం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్ నగర్ పోలీసులు
డెకాయ్ ఆపరేషన్ ద్వారా నాగరాణిని దిల్‌సుఖ్ నగర్‍లో రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్న పోలీసులు
యువతుల ఫోటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపుతున్న నాగరాణి
వారు ఓకే అని చెప్పిన తర్వాత ఆన్ లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్న నిందితురాలు
-
2025-03-18T08:32:54+05:30
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఢిల్లీ: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సాయంత్రం 6:55 గంటలకు దేశ రాజధానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం 2:10 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె రిసెప్షన్‍కు హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం
బుధవారం కూడా ఢిల్లీలో కొనసాగనున్న సీఎం చంద్రబాబు పర్యటన
రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురిని కలవనున్న సీఎం చంద్రబాబు
-
2025-03-18T08:22:44+05:30
ఏపీ శాసనసభ.. నేడు చర్చించే అంశాలు ఇవే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 13వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం
ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఏపీ శాసన మండలి 12వ రోజు సమావేశాలు
ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం
నెల్లూరు జిల్లాలో కాలువల ఆక్రమణ, ప్రైవేటు పాఠశాలల్లో భద్రతా చర్యలపై ప్రశ్నోత్తరాలు
అలాగే బుడమేరు ఆక్రమణ, సూపర్ సిక్స్ పథకాలపైనా ప్రశ్నోత్తరాలు
ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025ను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
వాట్సాప్ గవర్నెన్స్ పైనా శాసనసభలో లఘు చర్చ చేయనున్న సభ్యులు
ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక పర్యాటకం, ఏపీలో క్రీడా ప్రాంగణాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు
అలాగే 50 ఏళ్లకు పింఛన్ పథకం, రైతులు ఆత్మహత్యలు, తదితర అంశాలపైనా మండలిలో ప్రశ్నోత్తరాలు
శాసనమండలి ముందుకు 2025 ఏపీ ఆయుర్వేద హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు
పదవీకాలం ముగిసిన ఏడుగురు ఎమ్మెల్సీలకు ఘనంగా వీడ్కోలు పలకనున్న శాసనమండలి
-
2025-03-18T08:11:06+05:30
నేడు శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..
హైదరాబాద్: నాలుగో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ, ఆమోదం
నేడు సభకు రానున్న మరో నాలుగు చట్ట సవరణ బిల్లులు
న్యాయవాదుల సంక్షేమ నిధి, క్లర్కుల సంక్షేమ నిధి చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పలు గ్రామాలను మున్సిపాలిటీలో కలుపుతూ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును పెట్టనున్న మంత్రి సీతక్క
ఇవాళ శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై చర్చ, ఆమోదం