ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T Congress: కొత్త బాస్‌పై ఏఐసీసీ దృష్టి.. రేసులో కీలక నేతలు..!

ABN, Publish Date - May 19 , 2024 | 08:03 PM

తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్‌పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్‌పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 నెలల సమయం దాటుతోంది. దీంతో పీసీసీ అధ్యక్షుడిని ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై చర్చోపచర్చలు నడిచాయి.

కాగా రేవంత్ స్థాయిలో అంత ధీటుగా ఉండే నేతను ఏఐసీసీ పరిశీలిస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) 2021 జూన్ 27న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్పీకరించారు. పీసీసీ చీఫ్ హోదాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు.


రేవంత్ కీలక పాత్ర

కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో కేవలం 5 గురు శాసన సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు రేవంత్‌రెడ్డినే పీసీసీగా కొనసాగించనున్నట్లు సమాచారం.

అయితే ఫలితాల తర్వాత రేవంత్ స్థాయిలో ధీటుగా ఉండే నేత ఎవరైతే బాగుంటుందనే విషయంపై ఏఐసీసీ పలువురు కీలక నేతల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ కేడర్‌ చర్చించుకుంటుంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారన్న అంశంపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తన తర్వాత పీసీసీ చీఫ్‌గా ఎవరు వస్తారనే విషయాన్ని రేవంత్‌తో ప్రస్తావిస్తే ఆ అంశం తన పరిధిలో లేదని చెబుతున్నారు. హై కమాండ్ ఎవరిని పీసీసీ చీఫ్‌గా నియమించిన తనకు సమ్మతమేనని రేవంత్ అంటున్నారు.


దూకుడుగా ఉండే నేత కోసం పరిశీలన..

కేవలం 5గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యంగా రేవంత్‌రెడ్డిదే. కానీ ఆయన స్థాయిలో అంత దూకుడుగా ఉండే వ్యక్తి కాంగ్రెస్‌లో తక్కువనే చెప్పొచ్చు. ఎవరిని పీసీసీగా నియమిస్తే పార్టీ నేతలందరిని కలుపుకోగలరన్న అంశంపై ఏఐసీసీ దృష్టి సారించింది. కాంగ్రెస్ అధ్యక్ష స్థానంపై కీలక నేతలు ఆశ పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ రేసులో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు.

ఇక ఇప్పటికీ కూడా తాను పీసీసీ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మరోనేత మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి సైతం తనకు అధ్యక్ష పీఠం ఇవ్వాలని ఏఐసీసీకి విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రాజ్‌గోపాల్ రెడ్డికి పీసీసీ ఇవ్వరనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల నేతలు ఈ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవి కోసం పలువురు మంత్రులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పీసీసీ పదవి తనకు ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు.


రేసులో మంత్రులు

కర్ణాటకలో శివకుమార్ డిఫ్యూటీ సీఎంతో పాటు పీసీసీ పదవిలో సైతం ఉన్నారని.. తెలంగాణలో కూడా అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఈ రేసులో ఉన్నానని అంటున్నారు. తాను విద్యార్థి విభాగం నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని ఏఐసీసీ అగ్రనేతల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఈరేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మహేశ్ పీసీసీ చీఫ్ అవుతారని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక మరో బీసీ నేత మధుయాష్కిగౌడ్ కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు తన సన్నిహితులు ఉన్నట్లు చెబుతున్నారు.


మాదిగలకు ప్రాధాన్యం..!

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుయాష్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నిరాధరణకు గురువుతున్నారని ఆయనకు ఈ పదవి ఇస్తే అందరినీ కలుపుకెళ్తారని మధుయాష్కి అనుచరులు చెబుతున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ సైతం ఈ పదవి తనకు వస్తుందనే ధీమాతో ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్‌కు ఇస్తే బాగుంటుందన్న వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి నేతల పేర్లు కూడా పీసీసీ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఎవరిని నియమిస్తుందనే దానికిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 08:03 PM

Advertising
Advertising